పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డొక్కడు చేయుచున్నదిమాత్రమే కార్యస్థానమందలి కార్యము లన్నిటిలోను నిఘంటూపయోగియని తెలిసికొనిరి.

ఇట్లుండగా వెండియు సందేహము కలిగినవారై ఆతనిని పదసంగ్రహణ రూపమైన మంచిపని మానిపించి అందులకుబదులుగా తనజ్ఞాపికలను ఎవ్వడేనియు ఏపాటివాడేనియు నిఘంటువులో ప్రవేశపెట్టుటకు తగినయట్లుగా విస్తరింపుమని యాజ్ఞాపించిరి. అంతట సంపాదకుడు జ్ఞాపికలను విస్తరింపవలసినతీరును ఏర్పరించుటయనెడి యుత్కృష్ట (సంపాదక) కృత్యమును, దానితో గూడ ఆవిస్తరమును తానే వ్రాయుటయనెడి నికృష్ట (లేఖక) కృత్యమును, రెంటిని తానొక్కడే చేయవలసినవాడాయెను. ఆతడు పలుమాఱు తెలుపుడుచేసికొనగా, తుదకు, పూర్వోక్త నికృష్టకృత్యమును గావించుపనికి ఒక పాఠకుని రు. 35 లు జీతముచేసి నియమించినారు.

సంపాదకుడు 11/2 సంవత్సరము తావ్రాసిన 19 జ్ఞాపికాపుస్తకములలో భారతమునకు సంబంధించిన 8 పుస్తకములను ఇప్పటికి విస్తరలేఖనమునకు తగినతీరున పున:పరిశీలనచేసినాడు, పూర్వోక్తపాఠకుడు వానిని విస్తరించుచున్నాడు. సంపాదకుడు కోరినప్రకారము ఆదినుండియు ఇరువురు సహకారులను అతనికిచ్చియుండిన ఈ పున:పరిశీలనము అనావశ్యమగును. జ్ఞాపికలును సగముకాలములోనే వ్రాయబడియుండును.

పాఠకులకు ఇంకను పదసూచికలు వ్రాయుటకు అముద్రితగ్రంథము లీయబడలేదు. ఉన్నముద్రణములు పదసూచికాలేఖనమునకు అర్హమగునట్లు శుద్ధముగానున్నవని తలంచుట యొక పొరబాటు.

సంపాదకుడు నిఘంటుసభవారికి వారమువారము తా జేసినకార్యమును నివేదనచేయవలసినట్లుగా నిబంధన యొకటికలిగినది. అందువలన ఆతనిపని కంటితోకొలువదగినదిగాను కాగితముల సంఖ్యచే తెలియవలసినదిగాను ఏర్పడినది. ఈనియమనముమూలముగా అతనిపనికి మిక్కిలి ఆటంకముకలిగినది.

ఆతడు ఎప్పుడును నిఘంటుపని త్వరలో ముగియు నుపాయములను పన్నుచుండెను. వానిని వేనిని సభవారు కైకొనక వానికిబదులుగా ధనమును