పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభారతగత సర్వపదములను అకారాదిక్రమమున అర్థవిహీనముగా నొకగ్రంథముగా వ్రాయుట యనుపని యొకటి ఆదినుండి యీనిఘంటు నిర్మాణకార్యములో నొకభాగముగా నియమింపబడినది. కొంతకాలమైన తర్వాత ఆపనికి ప్రత్యేకముగా నొకపాఠకుడు రు 30 నెలజీతమున కేర్పఱుపబడియెను. ఆత డిప్పటికి సుమారు సంవత్సరమునుండి ఆపని చేయుచున్నాడు; దానిని ముగించుటకు ఇంకనుం గొన్నిసంవత్సరములు పట్టును, సిద్ధమయినప్పుడును దానివలన నిఘంటు సంపాదనకృత్యమునకు ఏపాటియు నుపయోగముండదు. మఱియు నిఘంటుగ్రంథలేఖన ప్రారంభమునకు ముందుగా ఈ భారతపదసూచియేమో సిద్ధము కానేరదు.

ఈభారతపదసూచియేగాక ఇట్టివే ఒకవత్సరమునుండి మఱియైదు గ్రంథములకు వ్రాయబడుచున్నవి. ఆఱుగురు పాఠకులు ముప్పదేసి రూపాయల జీతాలవారు వ్రాయుచున్నారు. అవి యింకను భ్రూణదశలోనే యున్నవి. పూర్తి చెందుటకు సమర్థతముల చేతులలో ఇంక నొక సంవత్సరము పట్టును, సిద్ధమయినను నిఘంటుకార్యమునకు అవి ఇంచు కేనియు పనికిరావు.

ఈపదసూచికలపై, నిఘంటుకార్యముపేర సంవత్సరమునకు రు. 12x30x6=రు. 2160 ల ధనమును ఇంక లేఖనసాధనములును వ్యర్థముగా వ్యయింపబడుచున్నవనుట స్పష్టము. పరిషత్తువారికి ఇవి కార్యాంతరమునకై వలయునేని వీనికై నిఘంటుకార్యార్థ ముద్దేశింపబడిన ధనమునుగాక వేఱు ధనమును వినియోగించి వేఱువిచారణలో రచియింపించుకొనుట యుచితము. పాఠకులను నియమించుటకు నిఘంటు నిర్మాణసభవారు నిశ్చయించుకొను నప్పుడు ప్రధానసంపాదకుడు ఆయుద్యమమును మాన్పుటకై సభలోమాత్రమేగాక సభ్యులను కొందఱను ప్రత్యేకముగా సందర్శించి వేడియుంగూడ యత్నించెను. కాని యాతనిమాట నెవ్వరును పాటిసేయరైరి.

పాఠకులకు బదులుగా నలుగురైదుగురు పండితులను ఎక్కువ తెలివిగలవారిని రు. 40 ల పాటి జీతములకు, శబ్దరత్నాకరములో లేనివియు అందున్నవే