పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దురా ? ఆముక్తమాల్యదను ప్రకటించు సందర్భమున వారిని స్మరించుచు నిట్లు శాస్త్రులవారువ్రాసిరి. "వారు జీవించియున్న నాకేమియు కొఱతయుండదు. దిగులులేక గ్రంథములు రచించుచు, ప్రకటించుచు, ఈయంత్యకాలమున లేమికి బొమ్మగట్టి ఋణమన్న మాట యెఱుగక సంపన్నుడనై నిశ్చింతుడనుగా నుందును. ఈ యల్పపుణ్యునికి అట్టియదృష్టము ఏలకలుగును!"

శ్రీ గునుపాటి యేనాదిరెడ్డి గారు ఆంధ్రప్రకాశికలో శ్రీ రాజాగారింగూర్చి ఇట్లువ్రాసిరి - "ఈమహారాజుగారి పరిచయము ఇరువది సంవత్సరములుగ గలిగియుంటిని. విద్యావిషయముగ నే నెపు డేమివ్రాసినను వెంటనే సాదరముగా సమాథానము వ్రాయుచుండిరి .....వీరు సంస్కృతాంధ్రములయందు అసదృశపాండిత్యము కలవారయి రసౌచిత్యగ్రహణమునందు నిపుణులయి విద్వద్వరేణ్యుల ప్రశంసాపాత్రులయి యుండిరి. మహాకవుల నెక్కువగ గారవమున ఆదరించుచుండిరి. ఆంధ్రసాహిత్య పరిషత్ప్రథాన పోషకులయియుండిరి. ఇట్టి భాషాపోషకులు మనదేశమున అరుదుగాగలరనుట సాహసముకాదు.

వీరు రచించిన తైర్థికవినోదిని మొదలగు గ్రంథములం జదివిన వీరికల్పనావైదగ్ధ్యము విశదమగును....."అని.

వీరి యకాలమరణముచే భాధితులైన వారలలో శ్రీ శాస్త్రులవా రొకరు.

          'చింతిలనేమిగల్గు విధిచేత బలీయము.'


____________