పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈనవీనమార్గము మనభాషకుపనికిరాదు.

........ఇందు దృడపాండిత్యముకై అనులోమమార్గమే అనుకూలముగానున్నది. దీనివలన క్లేశమును కాలమును కరము సంక్షిప్తములగును. ఈ గుణముంగననేరక విద్యాధ్యక్షులు ఈమార్గముందొలగించి ఈభాషను అసమర్థమయిన యేతద్విపరీత నవీనమార్గమున ఈభాషం జెప్పించుటచేత ఇది ఆదినుండియు కఠినమే అగుటయు, ఎన్నాళ్లుచదివినను పాండిత్యముసున్నయే యగుటయు...సంభవించుచున్నవి.

మఱియు.......తెలుగులో జయమొందమి పైతరగతికిపోవుటకు ఆటంకపడమిచేతను, ఇట్లెగబ్రాకగా ప్రాకగా యూనివర్సిటీ పరీక్షలయందు తెలుగులో జయము అతిసులభమగుటచేతను, అందులకై యీయధమ విద్యార్థులుకూడ చదువనే అక్కఱలేమిచేతను, విద్యార్థుల వ్రాత లెట్లున్నను జయములో మామూలు 'పర్సెంటేజి' ప్రతివర్షము తప్పనందునను, పాఠగ్రంథ ప్రశ్నపత్రమునకు (Text paper) యథాశక్తి ఇంచుకంత యుత్తరము వ్రాసి భాషాంతరీకరణ ప్రశ్నపత్త్రము (Translation paper) నకు మాత్రము ఉత్తరము విపులముగానేనియు లేక, ఆంధ్రీకరణమాత్రమయినను వ్రాసి, పరీక్షయందు జయమొందుట ప్రాయికమయి యుండుటవలనను, సర్కారుకొలువునకు తెలుగులోని తెలివితోపని లేనందునను, తెనుగు చక్కగాతెలిసినచో మునిషీలమైపోదుమేమో అని విద్యార్థులకును అట్లయిపోదురేమోయని వారితండ్రులకును దిగులు కలిగియుండుట చేతను.... ఈభాష యిప్పుడు కఠినమయినది.

ఆంగ్లభాష సులువనుట దానినిసాధించుటకై తాముపడిన ప్రయాసను మఱచుటచేత.

పరీక్షాగ్రంథములలో పదిపద్యములైనను చదివినాడా - పదచ్ఛేద విధానమయిన నెఱుంగునా - పదిపద్యములకైనను లక్షణావిరుద్ధముగా అర్థము చెప్పగలడా - లక్షణగ్రంథము ఏమైన చదివినాడా - అనువిషయములను