పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17-ప్రకరణము

గ్రామ్యవాదము - గురుజాడ అప్పరావుగారి జాబులు

ఇక్కాలమునకు సరిగా నాంధ్రదేశమున వ్యావహారికభాషావాదము బయలుదేరినది. శ్రీ కీ.శే. గిడుగు రామమూర్తి పంతులవారు ఉపన్యాసము లీయసాగిరి. వీరికి శ్రీ కీ.శే. గురుజాడ అప్పారావుగారు సహాయులైరి.

వేంకటరాయశాస్త్రులవారు నూతనమార్గ ప్రియులే యైనను వ్యావహారికభాషావాదమును ఎంతమాత్రమును ఒప్పుకొనలేదు. ఏమార్గమునుగాని స్థాపించుటకుగాని తప్పించుటకు గాని సమర్థులును పాండిత్యమునందును వాదపటిమయందును ఎల్ల వారిని మించియుండినందున వ్యావహారికవాదులకు మేరు పర్వతమువలె నడ్డుతగిలిరి. శాస్త్రులవారీ నూతనమతము నొప్పుకొన్నచో నికదీనికి ఏ భయమునులేదు. శాస్త్రులవా రొప్పనిచో వ్యావహారికభాషను సర్వజనాదరణీయముగా నొప్పించుటకు భగీరథప్రయత్నము చేయవలసియుండును. శాస్త్రులవారు తా మేపద్ధతి నవలంబించినను నెగ్గించుకొను శక్తిగలవారు. తమది క్రొత్తమార్గమేయైనను కొంత పూర్వసాంప్రదాయము ననుసరించియు ప్రమాణపూర్వకముగా నుండునట్లు చేయుస్వభావముకలవారు. ఆంధ్ర వచనమున పూర్వమార్గమును తొలగించి సులువుగా వ్రాయసాగిరిగదా. నాటకములు లోకస్వభావము ననుసరించి యుండవలయునని పాత్రోచితభాషం దెచ్చినారు. గ్రామ్య