పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈగ్రంథముల నన్నిటిని చదువునప్పటికి సంస్కృతమందు మంచి పాండిత్య మలవడును. విద్యార్థికి ఏగ్రంథముగాని స్వయముగా చదివి గ్రహించుశక్తి యలవడును.

శాస్త్రులవారి సంస్కృతనాటకముల యనువాదములు మూలమునకు చేరువగానుండును. కొన్నివిషయములలో నీయాంధ్రీకరణములు మూలమునకు వ్యాఖ్యాప్రాయముగా సైతముండును. సంస్కృతనాటకముల నాంధ్రీకరించుటకు ముందుగా వానింబఠించి భిన్న దేశముల ప్రతులను తెప్పించి పాఠ నిర్ణయముచేసికొని ఆవెనుక అనువదించుచుండిరి. ఈవిషయములంగూర్చి వారి విమర్శవినోదమను వ్యాసమునందు వివరము చూడవచ్చును.

ఆంధ్రగ్రంథములలో శాస్త్రులవారు పారిజాతాపహరణము, బిల్హణీయము, గౌరనమంత్రిప్రణీత హరిశ్చంద్ర ద్విపద, బాణాలశంభుదాసుడను విశ్వకర్మమతస్థుని సారంగధర ద్విపద, కావ్యాలంకారచూడామణి యను నలంకారశాస్త్రమును ఈ సంవత్సరమే (1910) ప్రకటించిరి. పారిజాతాపహరణమున శాస్త్రులవారు కొన్ని సవరణలంగావించిరి. వానిని గ్రహించియే శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్యగారు దీనికి వ్యాఖ్యరచించినారు. బిల్హణీయమున శాస్త్రులవారు ఒకటి రెండు పద్యములను తీసి ముద్రించినారు. "పుణ్యవిశేషలబ్ధ మృదుమధుర వాగ్వైభవంబున చేమకూర వేంకటపతి అమృతంపు గూరగారచియించిన" సారంగధరచరిత్రను లఘుటీకతో శ్రీ శాస్త్రులవారు 1911 సం.