పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శారదాకాంచిక - ద్వితీయకింకిణి.

వేంకటరాయశాస్త్రులవారు తమ విమర్శయొక్క అవతారికలో నిట్లువ్రాసినారు:-

"ఈకాలములో ఆంధ్రభాషలో ప్రబంధములు పెచ్చు పెరుగుచున్నవిగదా. వానిలో అనేకములవలన భాషకు కడుం జెట్ట గలుగుచుండుటంగాంచి, ఏదే నొకగ్రంథ మాథారముగా నీచెరుపునెల్ల విద్యార్థి జనోపయోగమునకై భాషారక్షకై వెల్లడిసేయ దలంపుగొన్నవాడనై అట్టి యిప్పటిగ్రంథములలోనెల్ల మ.రా.రా.శ్రీ, కొక్కొండ వేంకటరత్నము పంతులవారు రచియించిన యాంధ్ర ప్రసన్నరాఘవము నాయుద్యమమున కత్యంతోపయుక్తముగా నున్నందున దానిని విమర్శింప దొరకొంటిని. ఉపయోగబీజము నించుక వివరించెద.

"కతిపయపదములకు సజీవనిర్జీవసాధనములచే అర్థమెఱుంగుట గ్రంథార్థమెఱుంగుటగాదు. గ్రంథార్థములో అన్నిపదములయర్థము వాక్యములయర్థము కథాసందర్భము, రసంబునుంగూడజేరును. వీనినెల్ల మాని దానినిమాత్రము పూని చేసిన తెనిగింపునకు మూలగ్రంథ నామమిడుట సరిగాదు. ఈగ్రంథమందు భాషాంతరీకరణము ప్రాయికముగా తప్పుగానుండును. మూలమునకు ఇది మూలముగాను, దీనికిది టీకగాను ఉండును. కొన్నిచోట్ల నిది మూలమునకుంగూడ నభేద్యమయిన వజ్రకవచముందొడిగి కూర్చుండును........ ఛందో వ్యాకరణాలంకారముల కిదివేరుపురువు....రసము సున్న. పూర్వులు చెప్పిన పాకము