పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11-ప్రకరణము

శారదాకాంచికలు - పూండ్ల రామకృష్ణయ్యగారి జాబులు

కవిపండిత సంఘ ప్రథమసమావేశము ప్రతాపరుద్రీయ ప్రకటనకుముందే జరిగినది. శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు శాస్త్రులవారికి ఆప్తస్నేహితులై గ్రంథరచనకు పురికొల్పుచుండిరి. ప్రతాపరుద్రీయమును రచించుచు శాస్త్రులవారు నెల్లూరిలోను మదరాసునందును తమ మిత్రబృందమునడుమ చదువు చునుండిరి.

తే 10-7-1897 పూండ్ల రామకృష్ణయ్యగారు 'ప్రతాపరుద్రీయమును అచ్చునకిండు అది మీకు వెలగల యశస్సును సంపాదించుననుటకు సందియములేదు' అని వ్రాసినారు.

తే 6-11-1897 ది. ప్రతాప అచ్చైన యనంతరము, ప్రతాపరుద్రీయ నాటకముంజూచి బ్రహ్మానందముం జెందితిమి. నిన్నటి రాత్రి మా యిల్లంతయు దీని పఠనమువలన మన మిత్రబృందముచే నిండిపోయినది... ఈగ్రంథమునకు మిగుల ఖ్యాతి వచ్చుననుటకు సందియములేదు.' అని వ్రాసిరి.

11-11-97 నెల్లూరు

ఆర్యా,

నమస్కారములు. తాము దయతోననిచిన గ్రంథత్రయముచేరి మివుల సంతసించితిని. మీ యాజ్ఞానుసారముగ బుస్తకముల బుచ్చుకొంటిమి. తిక్కుబొక్కులవిషయమై మీరు