పుట:Thobithu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకు చావు ప్రాప్తించి ఈ వెతలన్నియు తీరిపోవును. నేనును శాశ్వతపదమును చేరుకొందును కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకుము ఇట్టి దైన్యజీవితము జీవించుటకంటె, క్రూరావమానములు భరించుటకంటె, చచ్చుట మేలు."


3. సారా

7. ఆదియే దినమున మేదియా దేశమునందలి ఎక్భటానా నగరమున వసించుచున్న రగూవేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తె యవ మానించెను. 8. ఈ సారాకు ఏడుసార్లు పెండ్లియైనది. కాని అస్మోదియసు అను దుష్టపిశాచము ప్రతి పర్యాయము సారా వరులను ఆమెను కూడకమునుపే చంపివేసెడిది. పనికత్తె సారాతో "నీ భర్తలను నీవే చంపివేయుచున్నావు. ఇప్పటికే నిన్ను ఏడురికి కట్టబెట్టిరి. కాని వారిలో ఒక్కనివలనను నీకు పిల్లలు పుట్టలేదు. 9. నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్మ దండింతువా యేమి? నీవును బోయి ఆ చచ్చిన వరులతో గలియుము. అప్పడు నీ సంతానమును కంటితో జూచు దుర్గతి మాకు పట్టదు" అని యనెను. 10. ఆ మాటలకు సారా విచారముతో వెక్కి వెక్కి యేడ్చెను. ఉరిపెట్టుకొని చత్తుననుకొని మేడమీదికెక్కిపోయి తండ్రి గది ప్రవేశించెను. కాని యూమె మరల "నేను ఇట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా? వారు - నీ కొక్కతియే కొమార్త. నీవామెను గారాబముగా పెంచుకొంటివి. కాని యిప్పడావెు దిగులుతో ఉరిపెట్టుకొనినది అనియనరా! నేను వృద్ధుడైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసలిప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకొనునట్లు చేయుట ఏమి న్యాయము! కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ యాత్మహత్యా యత్నమును మానుకోవలయును. నన్ను తీసికొనిపొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడికొందును. అప్పడు ఈ యవమానములను భరింప నక్కరలేదు" అని యనుకొనెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/9&oldid=237538" నుండి వెలికితీశారు