పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
బయలాటల బంగారు ప్రదర్శనాలు:

రాయల కాలంలో దేవాలయాల ముందు జరిగే బహిరంగ నాట్య ప్రదర్శనాలకు రాజులు కూడా హాజరవుతూ వుండేవారు. విఠలస్వామి దేవాలయంలో నాట్య ప్రదర్శనాలు వీక్షించడానికి వచ్చే రాజులకు ఎత్తైన వేదికలపై ఒక సింహాసనం అమర్చబడి వుండేది. నృత్యం చేసే నర్తకీమణులులు, వివిధ వాద్యకారుల భంగిమలు వున్న ఈ వేదికపై ఉన్న సింహసనంలో రాయలు ఆసీనులయ్యేవారు.

రాయల కాలంలోని ప్రాచీన శిల్పాలలో నాట్య కత్తెలు మహమ్మదీయ స్త్రీలు ధరించే పైజామాలను ధరించి, శరీరంపై చాల ఆభరణాలు ధరించినట్లు కొన్ని చెక్కబడి వున్నాయి.

దేదీప్యమానంగా వెలిగిన కళామూర్తులు:

ఆ రోజులలో గాయకులకు సంఘంలో ఎక్కువ గౌరవం వుండేదట. ఆ నాటి వాద్య పరికరాలలో వీణకు ఎక్కువ ప్రాముఖ్యమున్నట్లు అనేక ప్రబంధాలలో ఉదహరింపబడి వుంది. అనేక మంది గాయకులూ, సంగీత విద్వాంసులూ ఉత్తర హిందూ దేశంలో పర్యటించి, అనేక రాజాస్థానాలలో తమ విద్యను ప్రదర్శించి పోటీలలొ నెగ్గి విజయనగరానికి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువచ్చారు. సంగీత రత్నాకరం వ్రాసిన విఠలుని తండ్రి 22 రాగాలలో విశేష ప్రవీణతను సంపాదించి గురజాత్ మాండ్వీ సుల్తానును మెప్పించి వేయి తులాల బంగారాన్ని పారితోషికంగా పొందాడట. ఈ విధంగా విజయనగర చక్రవర్తులు కవి, పండిత, గాయక, నటీనటులను, శిల్పులను పోషించారు.

రంగరాజా, రంజకం కుప్పాయి:

శ్రీకృష్ణదేవరాయల నగరులోని నాట్యశాలలో కృష్ణదేవరాయలు స్వయంగా సంగీత నాట్యాలను ఆభ్యసించినట్లు చరిత్రాధారల వల్ల తెలుస్తూ వుంది. రాయల కొలువు తీర్చివుండగా