పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/772

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్తూరు జిల్లా

కుప్పం:

వీథి నాటకాలను ప్రదర్శించడంలో రాయలసీమ చిత్తూరు జిల్లాలో కుప్పం తాలూకా కుప్పం పట్నానికి సమీపంలో వున్న కొత్త ఇండ్లు అనే గ్రామంలోని శ్రీకృష్ణదేవరాయ నాటక సమాజం చరిత్రాత్మకమైనది.

రాయలసీమలో వీధి నాటకాలను ప్రదర్శించడంలో ఈ నాటక సమాజం తప్పా ఇంత పేరు పొందిన నాటక సమాజం మరొకటి లేదు.

ఈ వీథి నాటక కళా కారులు ఈ వీథి నాటక కళను వంశ పారం పర్యంగా కాపాడుతూ వస్తున్నారు. వీరు భారత, రామాయణ, భాగవతాలను మూడింటినీ వివిధ ఘట్టాలుగా విభజించి ప్రదర్శిస్తారు.

పాండవ జననం నుంచీ దుర్వోధన వధ వరకూ భారతాన్ని, పాండవ జననం, లక్షాగృహ దహనం ఇలా వివిధ ఘట్టాలుగా ప్రదర్శిస్తారు.

ఇక భాగవతంలో 'శ్రీ కృష్ణ లీలలు (బాల్య క్రీడలు), వామన చరిత్ర, నరకాసుర వధ, అనే ఘట్టాలను మాత్రం ప్రదర్శిస్తారు.

వీరి పూర్వీకులు పై పురాణ గాథలన్నిటినీ సంపూర్ణంగా ప్రదర్శించేవారు. ఈనాటి కళా కారులు మాత్రం పైన ఉదహరించిన ఆయా ఘట్టాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా వీరి భాగవతాలలో స్త్రీ పాత్రలన్నిటినీ పురుషులే ప్రదర్శిస్తారు. వారు అత్యద్భుతంగా అభినయిస్తారు. అది వారి ప్రత్యేకత.

ప్రసిద్ధ నటులు:

ఈ సమాజంలో అనేక మంది ప్రసిద్ధ నటులున్నారు. వారిలో నలబై అయిదు సంవత్సరాల వయసు కలిగిన సముద్రాల కె. వెంకటేశ్వర్లు స్త్రీ పాత్రలను అందులో