పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/652

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొబ్బియళ్లో గొబ్బియళ్లూ

కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులము స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవులు గాచిన
కొండక శిశువుకు గొబ్బిళ్ళో

అంటూ అన్నమయ్య తన మృదుమధురమైన పదజాలంతో శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుడు, కంసుణ్ణి వధించడం వంటి సాహసాలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు.

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటి ముందూ ఆడపిల్లలు రక రకాలుగా రంగవల్లులను తీర్చి దిద్ది వాటిమీద ఈ గొబ్బెమ్మలను వుంచుతారు. వాటిని పసుపు కుంకాలతో పూలతో అలంకరిస్తారు. వీటిని గొబ్బెమ్మలని, గురుగులను గొబ్బియ్యల్లనీ ఆయా ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు.

సంక్రాంతి సమయంలో బజారులన్నీ గొబ్బెమ్మలతో కళకళలాడుతూ పుంటాయి. సంక్రాంతి పండుగ వస్తూందంటే ఆడపిల్లలకి ఎక్కడలేని ఆనందం. పంట పొలాలనుండి పంటలు ఇంటికి వచ్చి ధాన్యరాసులతో కళకళ లాడుతూ వుంటాయి. పంటలక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న రైతుబిడ్డలు ఆనందోత్సవాలతో ఈ పండగను జరుపుకుంటారు. ముద్దులొలికే ముగ్గులతో ఇళ్ళనన్నిటినీ ముగ్గులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు.

ఆడపిల్లలు ఆవు పేడను తీసుకు వచ్చి వాటిని గుండ్రంగా చేసి గొబ్బెమ్మను తయారు చేస్తారు. పై భాగాన గురుగు చేసి అందులో పువ్వులను గుచ్చుతారు. వాటిని తీసుకు వెళ్ళి ముగ్గుల మధ్య వరుస క్రమంలో సుందరంగా అమర్చుతారు. వాటికి నైవేద్యంగా పండ్లను వుంచుతారు. తరువాత రంగురంగుల దుస్తులు ధరించిన