పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో ప్రాముఖ్యం వహిస్తున్నారు. జముకుల కథల వివరాలను ఆ శీర్షికలో వివరంగా వివరించబడింది.

ప్రారంభం 13 వ శతాబ్దంలో:

ఎల్లమ్మ కథా గాన ప్రచారం 13 వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. నాటి నుంచి ఈ నాటి వరకూ తెలంగాణా జిల్లాలలో రేణుకా, ఎల్లమ్మ కథలు విరివిగా సాగుతూనే వున్నాయి. ఇక ఎల్లమ్మ గుడులు తెలంగాణాలో ఎక్కడ చూచినా కోకొల్లలు. ఎల్లమ్మను ఇంత శ్రద్దగా వారు కొలుస్తూన్నారంటే, ఆ కథల పట్ల ప్రజలలో వున్న భక్తి శ్రద్ధలను అర్థం చేసుకోవచ్చు.

ఆయా రాజుల పారిపాలనా కాలంలో మారిని చారిత్రిక పరిస్థితుల దృష్ట్యా, రేణుకా ఎల్లమ్మ కథా గానం, ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో కూడ ప్రవేశించి, తెలంగాణా సరిహద్దుల దాటి మహారాష్త్రకు వెళ్ళిన గొండ్లి వారు, ఎల్లమ్మ కథలను గానం చేస్తూ కర్ణాటకకు కూడా వ్వాపింప చేశారు.

ఈనాటికీ కర్ణాటకలో రేణుకా దేవాలయాలున్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే ఉత్సవాలలో స్త్రీలు వివస్త్రలై నగ్నంగా అవేశంతో ఆలయం చుట్టు పరుగెత్తుతూ రేణుకాదేవిని పూజిస్తారు.

ముఖ్యంగా పల్లెల్లో వచ్చే కలరా, మశూచికం, పొంగు, ఆటలమ్మ మొదలైన వ్వాధులకు ఈ దేవతలే కారణంగా పూజిస్తారు. ఒకో ప్రాంతంలో ఒకో రకమైన దేవతల్ని అలాగే పూజిస్తారు.

కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గంగాణమ్మ, పోలేరమ్మ, మారెమ్మ,ఎర్ర మారెమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ,మొదలైన దేవతలను పైన ఉదహరించిన వ్వాధులు సంక్రమించినప్పుడు ఆదేవతల్ని నీచ దేవతలుగా ఎంచి, వాటిని సంతృప్తి పర్చటానికి, కొలువులను కొలుస్తారు.

ఆ దేవతల పుట్టు పూర్వోత్తరాలను ఆ వుత్సవాల సందర్భంలో కథా గానం చేసే వారు. ఆ కథా గానం చేసే వారే పూజారులుగా వుండేవారు. ఆ పూజారులు హరిజనులు ఆసాదులు, కుమ్మరి వారు, రజకులు, బైండ్ల వారూ మొదలైన వారుండేవారు. బైండ్లవారనే వారు హరిజనులే__