పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/612

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ముందు వెనుకల మృదంగ వాయిద్యం:

ఈ భాగవత కళలో మృదంగ వాయిద్య ఒక ప్రతేక బాణీలో ప్రాముఖ్యం వహించింది మృదంగం. ఈ బాణీకి జీవమని ముందే తెలుసుకున్నాం. ఇతర కళా రూపాలలో, కూర్చుని మృదంగం వాయిస్తూ వుంటే ఈ ప్రదర్శనంలో రెందు మృదంగాల్ని ముందు వెనుక నడుముకు కట్టుకుని గంటల తరబడి ప్రదర్శనం జరిగినంత కాలం, తెల్ల వార్లూ పాత్రల అభినయంతో పాటు నిలబడి వాయించటం చెప్పుకోతగిన విషయం. ఇది ఎంతో అబ్బురంగా వుంటుంది.

ఇది సంపూర్ణ దృపద రీతి, బొబ్బిలి ఆస్థానంలో "నంది భరతం" అనే మృదంగ జతుల గ్రంధం సృష్టించబడింది. ఒకే తాళలో, సప్త తాళాలు ఇమిడి వుండేరీతిలో, శబ్దాలను కూర్చి ఆడించటం ఈ కళాకారుల ప్రతిభను వెల్లడిస్తోది.

అమ్మవారి, జాతర అయ్యగార్ల ప్రదర్శన:

విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ అమ్మవారి జాతర జరుగుతుందో అక్కడ ఈ తూర్పు వీథిభాగవతం విధిగా ప్రదర్శించటం ఇప్పటికీ అచారంగా వస్తూంది. ముఖ్యంగా జాతర్లలో గ్రామ ప్రజలు ఎంతో ఆప్యాయితతో తెల్లవార్లూ ఈ కళారూపాన్ని చూచి ఆనందిస్తారు.