పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణ పఠనం వీధి మంటపంలో గాని, గ్రామ చావడిలో గాని చెప్పేవారు. పురాణ పఠనానికి ఏ విధమైన ఖర్చూ లేదు. భక్తీ, ముక్తీ రెండూ కలుగు తాయనీ విశ్వాసంతో ఎంతో మంది ఈ పౌరాణ పఠణానికి హాజరయ్యేవారు. ప్రేక్షకులు వచ్చే వారు వస్తూ వుంటే వెళ్ళి పోయే వారు పెళ్ళి పోతూ వుండే వారు. ఏ మాత్రం కొంచెం తీరిక వున్నా కాస్త పురాణ కాలక్షేపం వినిపోయేవారు. అంతేగాక, ఈ పఠనం సాయంత్రం పూట తీరుబడి వేళ జరిగేది. ఒకరు పురాణం చదివితే, మరొకరు విడమర్చి ఆర్థం చెప్పేవారు. గ్రామంలో వుండే పురుషులు ఏ మాత్రం అవకాశమున్నా వీథుల్లోనే వుండే వారు. ఆ నాటి వినోద కార్య క్రమాలన్నీ వీథుల్లోనే జరిగేది.

వీథి పురాణం యొక్క ప్రాముఖ్యాన్ని గూర్చి చంద్ర శేఖరుడు ఆనాటి జానపద కళారూపాలను తన శతకంలో వర్ణిస్తూ వీథి పౌరాణం యొక్క ప్రాముఖ్యాన్ని గూర్చి ఈ క్రింది విధంగా ఉదహరించాడు.

పద్యం

పండిన చేను నాది, పడమోసుకుపో నెలనాడు నీవు
పుర్రాండము సెప్పినావు గద బలె రమ్మెముగా బగుమా
న మిస, మా ముండ ఇనాలటంట, పడి మొత్తుకుసచ్చెను
నీవు మల్లి రామాండము సెప్పలంచు ననుమందుడు మూర్ఖుడు చంద్ర శేఖరా॥

అని వర్ణించాడు. అంటే ఆనాడు వీథి పురాణం కూడ ఎంతటి బలవత్తరమైన కళారూపమో ఆర్థం చేసుకోవచ్చు.