పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్తారు. లింగ ధారులు తప్ప మిగిలిన వారందరూ మద్య మాంసాలను ఆరగిస్తారు. వీరు గడ్డాలనూ, మీసాలనూ పెంచుతారు, క్షురకర్మ చేయరు, వీరముష్టులైన వీరు యాచిస్తే, వీరి స్త్రీలు, చాపలు అల్లడం పచ్చ బొట్లు పొడవడం మొదలైన పనులు చేస్తారు. బ్రాహ్మణులు, వైశ్యులు, జంగాలు, బలిజలు మొదలైన వారి ఇళ్ళలో తప్పా వీరు మరెక్కడా భోజనం చేయరు.

ఆవేశపరులైన వీరముష్టులు వీరావేశంతో కర్రసాములు కూడా చేస్తూ వుంటారు. తాషామర్పా వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేస్తూ, కర్రసాములో ఆరి తేరిన ఇరువురు ఇరు ప్రక్కల నుంచి కర్రలను చేత బూని గిర గిరా త్రిప్పుతూ అమిత పౌరుషంతో ఒకరి మీదికి మరొకరు కర్రను విసురుతూ ఆ కర్ర విసురుకు రెండవ వ్వక్తి తప్పుకుని ఎదురు దెబ్బ తీస్తూ, వాయిద్యానికి అనుగుణంగా, వాయిద్య వేగంతో పాటు కర్ర త్రిప్పుతూ, తమతమ ప్రజ్ఞలను చూపిస్తూ, చూపరులను

వుత్తేజపర్చి, వారిలో ఉద్రేకాన్ని కలిగిస్తారు. పల్లెలలో సహజంగా జరిగే ఉత్సవాలలో ఈ వీరముష్టులను ప్రదర్శనాలలో ప్రవేశ పెడతారు. వీరు కర్రసాములో, ఎంతటి అసాధ్యులో, కత్తిసాములోనూ అంత అసాధ్యులే.


బడిపిల్లల దసరా వేషాలు

పూర్వ కాలంలో విద్యను నేర్చుకునేందుకు వెళ్ళిన శిష్యులు, గురువుగారికి సకల పరిచర్యలు చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. ఆనాటి మాదిరి ప్రభుత్వం ఇచ్చే నెలజీతాలు మాదిరి జీతాలు వుండేవి కావు. అందువల్ల శిషులిచ్చే గురుదక్షిణ మేదే గురువుల జీవనాధారం జరుగుతూ వుండేది. ఇది తరువాత కాలంలో రూపాంతరం చెంది ప్రభుత్వం వద్ద పుచ్చుకునే జీతాలతో పాడు ఈ దసరా మామూళ్ళను కూడా దండుకునే వారు.

ఒకప్పుడు గురువు గారిని భక్తితో పూజిస్తూ, ఆరాధిస్తూ, గురువు గారి వద్ద నుంచి విద్యాభ్యాసం, ఆశీర్వాదం పొంది, విజయోత్సాహంతో, నిజజీవితంతో ఎటు