పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాటమరాజుకు పెద్ద గోవులమంద వుంది. ఆ మందను మేపటానికి పాలకొండ, నల్లమల అడవుల్లో మేతకు తోలుకు పోయేవారు. వర్షాలు లేక పోవటం వల్ల మేత లేక నెల్లూరు మండలానికి వచ్చి నల్లసిద్ధి చోళ మహారాజునకు పుల్లరిగా తమ మందలోని కోడె దూడల్ని ఇచ్చేటట్లు స్థానిక చరిత్రలో వుంది.

వీరికీ యుద్ధం జరగటానికి మూడు కారణాలను వివరించారు.

1. నెల్లూరు సీమలో కూడ మేత కరువు రావటం వల్ల నెల్లూరు రాజ్యంలో పంట పొలాన్నీ కూడ మేప సాగాడు. ఇది నల్లసిద్ధికి కోప కారణమైంది.

2. అడవుల్లో వున్న క్రూర మృగాల్ని యాదవులు వేటాడటం వల్లను మందల్ని విస్తారంగా ఆడవుల్లో ప్రవేశపెట్టటం వల్ల మృగసంతతి నశించింది. అది కూడ ద్వేషానికి కారణమైంది.

3. ఇది కాక మనుమసిద్ధి రాజు ఉంపుడు కత్తె పెంపుడు చిలుకను కాటమరాజు తండ్రి పోలుర్రాజు బాణంతో కొట్టి చంపటం వల్ల సిద్ధి తన మనుషులతో కాటమరాజు ఆవుల మందల్ని చంపించాడు. దానితో కాటమరాజు పుల్లరివ్వటం మానేశాడు. అందువల్ల ఇరువురి మధ్య యుద్ధం జరిగింది.

కొమ్మువారు:

కొమ్ముల వారనే వారు గంగ దర్శనానికి సంబంధించిన మాదిగలు. వీరు తాము జాంబవంతుని తెగకు సంబంధించిన వారమని చెప్పుకుంటూ వుంటారు. వీరినే చిత్తూరు జిల్లాలో బట్టువారని పిలుస్తారు.

కొమ్ముల వారు యాదవుల్ని యాచిస్తారు. వారి గోత్రాలను చెపుతూ కాటమరాజు కథల్నీ, విష్ణు భాగవతమనే నామాంతరం గల కంసుడు కథను వీరు చెపుతారు. వీరి ప్రదర్శనలో "వీరణాన్నీ" "తిత్తినీ" "తాళాల్నీ" "కొమ్ముల్నీ" ఉపయోగిస్తారు. కాటమరాజుకు సంబంధించిన కథలన్నీ వీరి దగ్గర తాళపత్ర గ్రంథరూపంలోనూ కంఠస్థంగానూ వున్నాయి.

యాదవులకు గంగ ఆరాధ్య దైవం. గంగ జాతర్లలో కొమ్ములను గావుపట్టి ఊదుతారు. తానకముల్ని పాడటం, కాటమరాజు కథలను చెపుతూ వుంటారు.

కాటమరాజు సైన్యంలో ప్రత్యేకంగా గోసంగిదళం వున్నట్లు వీర గాథలలో చెప్పబడింది. దాని నాయకుడు బీరినీడు. ఈతను మాతంగి వీరుడు. ఈతని సంగతి