పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బృంద నృత్యం. కోలాటం కూడ శ్రీకాకుళానికి చెందిన సామంతుల జాతివారు చేసే నృత్యం. ఇది పెళ్ళిళ్ళ సందర్భంగా కేవలం పురుషులు చేసే నృత్యం.

చెంచు నృత్యం:

మహబూబ్ నగర్ కు చెందిన చెంచు జాతి వాళ్ళు, పెళ్ళిళ్ళ సందర్బంగా చేసే నృత్యం. ఇది ఆడ మగ కలిసి చేసే నృత్యం.

లంబాడి:

లంబాడి హోలీ నృత్యం నల్లగొండకు చెందిన లంబాడీ జాతి వారు హోలీ పండుగ సందర్భంలో చేస్తారు. దీన్ని హోలీ నృత్యం అని కూడా అంతారు. ఇది స్త్రీ పురుషులు కలిసి చేసే నృత్యం.

కోయ నృత్యం:

ఇది ఖమ్మం జిల్లాకు చెందిన కోయ జాతి వారు విత్తనాలు నాటే సందర్భంలో చేసే నృత్యం. వరి పంట చేతికి వచ్చిన సందర్భంలో చేసే నృత్యం, ఇది కూడ స్త్రీ, పురుషులు కలిసి చేసే నృత్యమే.

లంబాడి నృత్యం:

దీనిని రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ ప్రాంతపు లంబాడీలు చేస్తారు. ఇది పండుగల సందర్భంగా ఆడవాళ్ళు చేసే బృంద నృత్యం. ఈ నృత్యాలను గిరిజనులు చేసేటప్పుడు తుటుంపర్ర, వెట్టి, డప్పు మొదలైన తోలు వాయిద్యాలను "బాంసారి