పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. చెమటకు తడిసిన చెదిరిన గంధం
ఘుమ ఘుమ లాడిందో లలనా ॥కం॥
4. చెరిగేటప్పుడు చేతులు గాజులు
గల గల లాడిన ఓ లలనా ॥కం॥

5. గొప్పది రోకలి గుప్పున దంచగ
జబ్బలు కదిలిన ఓ లలనా
ఘన జబ్బలు కదిలిన ఓ లలనా ॥కం॥

ఈ విధంగా ఒక ప్రక్క నృత్యం జరుగుతూ వుంటే, చుట్టు ప్రక్కల ఇళ్ళలో వుండే స్త్రీ, పురుషులతో పాటు, పిల్లలు కూడా వుత్సాహంగా మూగుతారు. ఈ సమయంలో సోడిగాడు వంకర దుడ్డు కఱ్ఱను పిల్లల కాళ్ళకు పట్టి లాగుతూ, భయపెట్టి నవ్విస్తూ వుంటాడు. సోడిగాడు వేషధారణ నవ్విస్తూ వుంటుంది. (మరో చోట సోడిగాడిని గురించి వేష ధారణతో సహా ఉదహరించ బడింది.)

ఓ చిన్న దాన:

ఈ నృత్యంలోనే

ఓ చిన్నదానా, ఓ చిన్నదాన
గుంటూరు చిన్నదానా
గురుగూ మెట్టాలమీద
గజ్జలుంటే షోకే .॥ఓ చిన్నదానా?॥

నల్ల నల్లటి దానా
నడుము సన్నని దాన
నడుమూ సన్నము మీద
నగ లుంటే షోకే ॥ఓ చిన్నదానా?॥

అంటూ శృంగార పదాలను కూడ అద్భుతంగా పాడుతారు.