పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరం సంభాషణ ద్వారా ఏయే కథలు తాము చెప్పగలరో సభా ముఖాన వివరించి ఏ కథ కావాలో ప్రేక్షకుల్నే ప్రశించి వారు చెప్పమన్న కథను ప్రారంభిస్తారు.

కథలన్నీ పౌరాణికాలే. కథంతా పూర్తి అయిన తరువాత ప్రేక్షకులు కోరిన మీదట సుదీర్ఘమైన పాటలు పాడతారు. వీటిల్లో చెప్పుకో తగినవి మందులాడి పాట, కామమ్మ కథ మొదలైనవే కాక, ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘర్షణలను కూడా పాటలు కట్టి పాడుతారు.

ఇరవై బాణీలు, ఇరవై రాగాలూ:

ప్రతి కథలోనూ, కథకుడు షుమారు ఇరవై బాణీల్లో పాటలు పాడుతాడు. పాటకూ, పాటకూ మధ్య కథనాన్ని రాగ యుక్తమైన వచనంలో రాగ రంజితంగా చదువుతాడు. ప్రతి పాటకూ బాణీ మారుతూ వుంటుండి. వాద్య నృత్యగాన సమ్మేళనంతో కథ హృద్యమంగా నడుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వంతదారులుకథలో వచ్చే పాత్రలుగా మారిపోతాడు. ఉదాహరణకు కథకుడు సుభద్రగా నటిస్తే వంత పాటకాళ్ళు ఒకడు అర్జునుడుగానూ మరొకడు మన్మథుడు గానూ, మారి పోతాడు. జముకుల కథా ప్రదర్శనలో ఇలా ఒక విచిత్రమైన డ్రామా నడుస్తుంది.

అంట రాని వాళ్ళూ, అన్నం లేని వాళ్ళూ:

పైన వివరించిన బుడికి లేదా జముకుల పాట గాళ్ళు నిరుపేదలైన అంటరాని కులాలకు చెందిన వాళ్ళు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు. ఒక వేళ వున్నా అది అంతంత మాత్రమే. అదీ శ్రీకాకుళం మాండలిక యాసలో వుంటుంది. యాసతో కూడిన వారి భాష నవ్వు పుట్టిస్తూ వుంటుంది. ఎ ఏ అక్షరాలను వె వేలుగా పలుగుతారట, అలాగే ఎన్ని - వెన్ని - ఏనుగు - వేనుగు వచనం చెప్పే టప్పుడు వాక్యంలో ముఖ్యమైన పదాలు ఏవైతే వుంటాయో వాటిని ఈ విధంగా వత్తి పలుకుతారట.

ఖోట కెలపల ఉధ్వేన వనంలో హర్జనుడు తపస్సు
లున్నాడు, అతగాడి ధెగ్గెరికి సుబద్ర భంగారు
తబుకలో నప్పలాం పట్టుకొనె లగెల్తందందే

ఇలా సాగుతుంది వారి భాష. ఇది యాస కాదు గంభీరంగా వాచిక చెప్పడంలో వచ్చే దుశ్శబ్ధాలు.