పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన చుట్టూ వందలాది మంది జనాన్ని మూగేలా నానా హంగామా చేస్తాడు. అందర్నీ ప్రసన్నుల్ని చేసుకుంటాడు. ఇక అప్పుడు ప్రదర్శనం ప్రారంభిస్తాడు. ఇది దేవర పెట్టెండి, పెట్టెలో అమ్మోరు సత్తెం చూడండి, అంటూ కొన్ని మాయలను చూపిస్తాడు. వేప మండలను దూసి తేళ్ళను సృస్టిస్తాడు. అమ్మవారిని అందరికీ తెర తీసి చూపిస్తాడు. బొమ్మైన అమ్మవారి చేతుల నిండా గాజులు లుంటాయి. అందర్నీ చూడమంటాడు. తెరను దించేస్తాడు. భార్య వీరణాన్ని ఉధృతంగా వాయిస్తూ వుండగా తాను కొరడాతో ఛెళ్ ఛెళ్ మనిపిస్తూ పెట్టె చుట్టూ నృత్యం చేస్తూ అమ్మారి ముందున్న తెర ఎత్తుతాడు. అంతకు ముందు అందరూ చూసిన గాజులు మాయమై పోతాయి. ప్రేక్షకు లందరూ ఆశ్చర్య చకితులై అమ్మవారు సత్యం గలదనీ, భక్తి భావాన్ని పెంచుకుంటారు. ఇలా కొన్ని మాయలూ,

మంత్రాలతో, కనికట్టు విద్యను ప్రదర్శించి, ప్రేక్షకుల నాకర్షించి, అందరివద్దా చందాలు దండు కుంటాడు. ఈ ప్రదర్శనం పగటి ప్రదర్శనం. ఈ ప్రదర్శనానికి ప్రజలు ముగ్దులై పోతారు.