పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్రాయని సీతారామశాస్త్రి, ప్రయాగ సంగయ్య, బాలాజీదాసు, కోసూరి భోగలింగ దాసు, తంపిళ్ళ సత్యనారాయణ, ఎరుకయ్య మొదలైన మహమహు లెందరో ఆంధ్ర దేశంలో హరిథా గానాన్ని ప్రచారం చేశారు.

ప్రసిద్ధ హరిదాసులు:

పై వారే గాక, వడ్లమాని నరసింహదాసు, ఉమాకాంత దాసు, బాలబ్రహ్మనంద దాసు, బులుసు పాటివెంకటప్పయ్య, బెజవాడ లింగ మూర్తి, భమిడిపాటి వెంకటరమణ, చిట్టిమళ్ళ రంగయ్యదాసు, శలక వరపు లింగమూర్తి శర్మ, పెద్దింటి సూర్య నారాయణ దీక్షిత దాసు, పాతూరి మధుసూదన రావు, చొప్పల్లి సూర్య నారాయణ భాగవతార్, మహావాది వెంకటప్పయ్య, కోసూరి పున్నయ్య, కొండపల్లి కళ్యాణ దాసు, మైనంపాటి నరసింగ రావు, కడలి వీర దాసు, శ్రీమాతి ఆర్. దుర్గాంబ, మహేంద్రవాడ కామేశ్వర రావు, పిల్లలమఱ్ఱి రామదాసు, ములుకుట్ల సదాశివ శాస్త్రి, రాజశేఖరుని లక్ష్మీపతి రావు, పొడుగు పాండురంగ దాసు, తాతిన సీతారాయ్య, ములుకుట్ల పున్నయ్య శాస్త్రి, శ్రీమతి యస్. రాజకుమారి చౌదరి, నవుడూరి విశ్వనాథ శాస్త్రి, పొట్లూరి వెంకట రామయ్య, ముట్నూరి సూర్య నారాయణ శాస్త్రి, బంకుపల్లి సింహాచల భాగవతార్, చిట్యాల ఆంజనేయ భాగవతార్, శ్రీ మతి బేబి రాణి, బసవలింగం, అమ్ముల విశ్వనాథం, కోట్ఘ సచ్చిదానంద శాస్త్రి మొదలైన ప్రసిద్ధ హరికథకులు నారాయణ దాసు లాంటి పెద్దల బాటల్లో నడిచి హరికథ కళను ప్రచారం చేశారు.

మరుపురాని మరికొందరు హరిదాసులు:

ఈనాడు ఆంధ్ర దేశంలో హరికథగానకళ విస్తృతంగా వ్యాపించి ప్రజల నెంతగానీ ఆకర్షిస్తూంది. రాష్ట్ర వ్వాపితంగా ఈ కళను ఈ క్రింద ఉదహరించిన ఎంతో మంది కళారాధకులు ప్రచారం చేస్తున్నారు. మిక్కిలి

నేని పరంధామయ్య (కోవెన్ను), ఘట్టి శేషాద్రి (రేలంగి). చదలవాడ వెంకట్రాయుడు (భీమవరం). వీర్ల రామచంద్రయ్య (తణుకు) , చిట్యాల పార్థ సారథి (తాడేపల్లి గూడెం) అన్నమనీడి బాలకృష్ణ (రామచంద్ర పురం). మట్టా వజ్ర శేఖర్ (వుప్పాక పాడు), గూన పల్లి తాతావారావు (రామచంద్ర