పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకయ్యగారి కథలన్నిటినీ, కీ॥శే॥దొడ్డారపు వెంకటస్వామిగారు మహద్భుతంగా చెప్పి ప్రచారంలోకి తీసుకొచ్చారు. వెంకయ్య గారిని గురించి గృహలక్ష్మి సంపాదకులు కేసరి గారు తన చిన్ననాటి ముచ్చట్లలో ఉదహరించారు. వెంకయ్యగారు విరాటపర్వంలో ఉపయోగించిన రగడ.

రగడ

అనిన ద్రౌపదిని గనుగొని భామిను లాశ్చ్యరంబునను
ఘనముగ నిట్లని బల్కిరి తమలో వనిత లందరును గూడి
ఏమి చోద్య మిది నమ్మవచ్చునా ఇంతులార మనము
భామామణి యొక రింటివద్ద తా బానిసంబు చేయ.

గంజి నాగదాసు

గంజి నాగదాసు 1885 ప్రాంతానికి చెందినవాడు. స్వగ్రామం ఫలానా అని ఎక్కడా చెప్పుకోలేదు కాని ప్రతి కీర్తనలోనూ మంగళాద్రి అని చెప్పుకొనడం వల్ల అది గుంటూరు జిల్లాలోని మంగళగిరి కావచ్చును.

ఈయన శ్రీయాళు చరిత్రను రసవంతంగా రచించాడు. సరియైన పాత్ర పోషణతో పాటు కరుణ రసం నేర్పుగా చిత్రింపబడింది. సులభశైలిలో వ్రాయ బడిన ఈ కథలో రగడలు, కంద పద్యాలు అక్కడక్కడ కీర్తనలు, ఇతర ఛందస్సులతో పాటు కొన్ని శ్లోకాలు ఉదహరించబడ్డాయి.

కిలారు బ్రహ్మయోగి:

కమ్మ కులానికి చెందిన కిలారి బ్రహ్మ యోగి ...భళ్ళాణరాయ కథ ఆనే జంగం కథను రచించాడు. ఈయన 1895 ప్రాంతానికి చెందినవాడు. ఈయనది మొద పెండ్రేల గ్రామం. తరువాత చింతలపాలెంలో వున్నట్లుగా పీఠికలో వాసుకున్నారు.

బ్రహ్మయోగి విష్ణుభక్తుడైనప్పటికీ వీరశైవ కథను రచించాడు... భల్లాణరాయ కథ 1180 ప్రాంతంలో పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో వుంది. బ్రహ్మయోగి కవిత్వం విన సొంపుగా వుంది. జంగాలు