పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే బసవ పురాణంలో సోమ నాథుడు శ్రీయాళ చరితను గురించి

కరిమర్థి నూరూర శిరియాలు చరిత__
పాటలుగా గట్టి పాడెడివాడు.

అనదాన్ని బట్టీ,

శ్రీనాథుడు కాశీ ఖండంలో దక్షవాటి పురమును వర్ణిస్తూ........

కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్ష గాన సరణి.

అనడాన్ని బట్టీ గంధర్వగానాన్ని యక్షగాన సరణిలో పాడి వినిపించే వారని అర్థమౌతోంది. పై వుదాహరణలను బట్టి _ ఒకే నటి వివిధ వాద్య విశేషాలతో వివిధ పాత్రల్నీ అభినయించేదని తెలుస్తూంది.

ఈ జాతికి చెందిన కథలను స్త్రీలే కాక, పురుషులు కూడ పాడి వినిపించినట్లు క్రీడాభిరామంలో..

వాద్యవైఖరి కడునెరవాది యనగ_ ఏకవీరా మహాదేవి ఎదుట నిల్చి,
పరశురాముని కథలెల్ల ప్రౌఢి పాడే _ చారుతర కీర్తి బవనీల చక్రవర్తి.

వివిద వాద్యాలలో పరశురాముని కథలు బవనివారు పాడి వినిపించినట్లుగా వుంది. జవనికలు, డక్కీలు మొదలైన వాద్య వైఖరులన్నీ చేరి వుండవచ్చును. ఇందుకు మారో వుదాహరణగా పండితారాధ్య చరిత్రలో...

నాదట గందర్వ యక్షవిద్యాధి...
రాదులై పాడేడు నాడెడు వారు.

పై వర్ణనలను బట్టి నటి నాట్యానికి అనుకూలమైన దుస్తులు ధరించి యక్షిణి లాగా తంబూరా లాంటి జంత్ర వాయిద్యాన్ని వాయిస్తూ, పాడుతూ, ఆడుతూ కథ వినిపించేదని తెలుస్తూ వుంది.