పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓ దొరగారు, మంచి మంచి మందులుండాయి. ఓ, మేలాడి, దోమ తిరుగుడు, దేశ తిరుగుడు, తల తిరుగుడు, రోగాలకు మేలైన మందులు గాడిదలమీద మోయించుకొచ్చాము దొర.

ఓ పాము కరిత్తే, దోమ కుడితే, ఎలుక కరిత్తే, ఓ దొర కుక్క కరిత్తే, ముల్లు కొడితే, శెముడుకు మందు, పైత్యానికి మందు, ఓ దొర ఎన్నో మందు లుండాయి.

విభూతి భవానీలింగం పార్టీ- మందుల వాళ్ళు


ఓ దొర , తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, ఓ పిల్లి అడుగు, ఓ పిట్టకాలు, కస్తూరి, గోరోజనం, సీతమ్మ రసం, ఆనంద భైరవి, వంగ భస్మం, రాతి భస్మం, ఓ సువర్ణ భస్మం, తామ్ర భస్మం, మకర ధ్వజం, చంద్రోదయం, ఓ ఎన్నో మంచి మంచి మందులున్నాయి దొర.

ఇలా మందు ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని మందుల్నీ వివరిస్తూ, ఆ మందుల్లో ఏయే మందు, ఏయే జబ్బుకు వాడవచ్చునో, అయుర్వేద శాస్త్రాన్నంతా వివారిస్తారు. పెద్ద వాళ్ళకు, ఆడ వాళ్ళకు పిల్లలకు, ఎవరికి వాడే మందులు, వారి చెప్పి చివరికి.

ఒయమ్మో, ఓ తల్లో... ఊరికే సూతారేమమ్మో, మాదాకవళం వెయ్యమ్మో అంటూ, ఓ రామయ్యగోరో, ఓ రంగయ్య గోరో, ఓ రత్తయ్య గోరో, అయ్యో మా అయ్యో, ఓ అయ్యో.