పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రుతి పక్వమైన హార్మోనియం, వీర్ఫి ముఖానికి రంగులు, అర్దళం, గంగ సింధూరం, కాటుక, దుస్తులు, పూసల కోట్లు మొదలైనవి. ప్రదర్శన కాలం, ప్రారంభించింది మొదలు తెల్లవార్లూ ప్రదర్శించేవారు. ఈ మధ్య వీరి భాగవత ప్రదర్శనాల ప్రభావం చాలా తగ్గి పోయింది.

యానాదుల వేషాలు:

ముఖ్యంగా ఈ నాటికి కూడ ఆంధ్ర దేశంలో పట్టణాలలోనూ, పల్లెలలోనూ దసరా పండుగ దినాలలోనూ, చిత్ర విచిత్రమైన వేషాలను చూస్తూనే వున్నాం.

అలాగే యానాదులు కూడ పండుగకు చిత్ర విచిత్రమైన వేషాలు ధరించి చిందులు వేస్తూ వుంటారు. ఇది ఒక ప్రదర్శనంగా వుండదు. ఇంటింటికి తిరుగుతూ వ్యాచిస్తూ వుంటారు.

ముఖానికి రంగులు పూసుకుని రాగాలను తీస్తూ, చిందులు తొక్కుతారు. కొంత మంది గుర్రపు తలను ధరించిన డమ్మీ గుఱ్ఱాలలో దూరి వెనక్కూ ముందుకూ,తాళం ప్రకారం గుఱ్ఱపు నృత్యం చేస్తారు.

ముఖ్యంగా యానాది వేషాలలో చెంచులక్ష్మి, నారసింహుల పాత్రలూ, శ్రీకృష్ణుడూ, దుర్వోధనుడూ, భీముడూ, శివుడూ, రాముడూ మొదలైన పాత్రలు ధరిస్తారు.

వీరి పాత్రలకు కిరీటాలుగా అట్ట కిరీటాలను, కాగితపు పిండితో తయారు చేసిన గదల్నీ ధర్ఫించి, ఆ యా పాత్రల ప్రగల్బాలతో ఒక పాత్ర మీదకు మరొక పాత్రధారి లంఘిస్తూ వుండేవారు.

వారు ధరించే దుస్తులు పాత్రకు ఔచిత్యం ఏమీ వుండదు. ముఖం చూస్తే కృష్ణుడైనా ప్యాంట్లు తొడిగి బూట్లు వేసే కృష్ణుణ్ణి యానాది వేషాల్లోనే చూడలుగుతాము. రాముడు పాత్ర ధారి కోటు తొడుగుతాడు. ఇలాంటి అస్తవ్యస్త వేషధారణతో హాస్యాన్ని గుప్పించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. అందువల్లే యానాది వేషాలు వేయకు. యానాది చిందులు తొక్కకు అనే మాటలు పుట్టాయేమో తెలియదు. కాలం మారిన కొద్దీ ఆయా జాతుల కులాలకు సంబంధించిన సాంప్రదాయ కళా రూపాలన్నీ క్రమేపీ నశించి పోతున్నాయి. అయితే ఆ నశించి పోయే కళారూపం