పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నికి నాలుగు రూపాయలిచ్చేటట్లూ ఇంటికి ఒకరు చొప్పున జట్టులోని వాళ్ళకు భోజనాలు పెట్టేటట్లు ఏర్పాటు జరగగానే ప్రదర్శనం జరుగుతూ వుండేది.

ఆ జట్టులో సత్యభామ పాత్రధారిణి అలివేలు చాల అందకత్తె కావటం వల్ల ప్రతివాళ్ళు ఆమెనే భోజనానికి ఆహ్వానిస్తూ వుండేవాళ్ళట. ఆమె అందుకు అంగీకరిస్తే విందు షడ్రసోపేతంగా జరిగేదట. ఈ సంగతి గ్రహించిన వెంకటస్వామి ప్రతి ఇంటివారికీ, సత్యభామే భోజనానికి వస్తుందని చెప్పి వచ్చేవాడట. ఆ విధంగా ఆ జట్టులోని వాళ్ళందరికీ చక్కని విందు అందేదట.

ప్రదర్శనం ప్రారంభం:

నాటక ప్రదర్శనం నాడు రంగస్థలానికి ముందు వరుసలో కరణం, మునసబు ఆదిగా అన్ని వర్గాల వారూ కూర్చునేవారట. సాధారణంగా ఈ జట్టు ప్రదర్శనలు భాగవతంతో ఆరంభమయ్యేవి, అందులో ముఖ్య పాత్రలు శ్రీ కృష్ణుడు, సత్యభామ, గొల్లభామ, సుంకరి కొండడు.

ఈ పాత్రలు తెర వెడలే ముందు రంగ స్థలానికి రెండు ప్రక్కలా వెండి దివిటీల్ని పాత్రధారుల ముఖాలకు దగ్గరగా వుంచి వాటిపై గుప్పెడు గుగ్గిలం చల్లేవారు. ఆ వెలుగులో ఠీవిగా విఱ్ఱవీగుతూ పాత్రలు రంగ స్థలంలో ప్రవేశించేవి. ఆనాటి రంగస్థలానికి యవనిక, అడ్డంగా పట్టే వెడల్పయిన గుడ్డ మాత్రమే వేషధారణలో ఉపయోగించే ఆభరణాలన్నీ తేలిక కొయ్యతో కాకి బంగారం అంటింపులతో తయారయ్యేవి.

పండితులకు పాత్రధారుల సవాలు:

ఆ కాలంలో వీథి నాటకాల్లో సత్యభామ తన జడను తెర వెలుపల వేయడం, సభలో కూర్చున్న పండితులు భాగవతం విషయమై ప్రశ్నిస్తే జవాబు చెప్ప గలనని సత్యభామ పాత్రధారిణి సూచించటం ఒక సంప్రదాయంగా వుండేది. ఈ సూచనకు పండితులు ఆగ్రహించి భాగవతం పద్యాలకూ కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలకూ భావార్థాలు చెప్పమని అడిగేవారు.

అలివేలమ్మ వాటిని క్షుణ్ణంగా వల్లించేది. పండితులు అంతటితో తృప్తి చెందక ఆమెకు భరత శాస్త్రం, అలంకార శాస్త్రం గురించి ప్రశ్నలు అందించేవారు. వాటికి