పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామబ్రహ్మంగారి అధ్యుక్షతను జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో, తాము సూత్రధారులుగా ప్రదర్శనమిప్పించి, 'సెహభాష్ ' అనిపించి, నాటి రాఘవయ్యగారి ఉన్నత స్థానానికి పునాదులు వేశారు.

వెంకట రామయ్యగారి శిష్యులలో పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ కడపటి వారు.

వెంకటరామయ్యగారి శిక్షణ విచిత్రమైంది. వారికి ఏ సమయంలో, ఏ అడుగు ఏ భావం, ఏ రీతి, ఏ భంగిమ స్ఫురణకు వస్తే అదల్లా అప్పుడే అక్కడే శిష్యులకు బోధించేవారు. ఇంతటి ప్రతిభావంతుడైన వెంకట్రామయ్యగారు 90 సంవత్సరాలు ధృవతారగా వెలుగొంది 6_1_1949 లో కీర్తిశేషులైనారు.

బహువేషధారి భాగవతుల విస్సయ్య:
భాగవతుల విస్సయ్య

భాగవతుల విస్సయ్య గారు వృషభనామ సంవత్సర పాల్గుణ మాసంలో కూచిపూడిలో జన్మించారు. వీరి తండ్రి గారు భాగవతుల రామయ్య గారు, విస్సయ్య గారు 7 సంవత్సరాల ప్రాయంలోనే సిద్ధేంద్ర యోగీంద్రుల భామాకలాపాన్ని రాగ, తాళ, హావ, భావాలతో అభ్యశించారు. తండ్రిగారి వద్దా, భాగవతుల యజ్ఞ నారాయణ గారి వద్దా భరత శాస్త్రాన్నంతా అభ్యసించారు. 10 సంవత్సరాల ప్రాయంలోనే బాలింత వేషం వేసి ప్రఖ్యాతి వహించారు. బహుమతుల్ని అందుకున్నారు. యుక్తవయస్సు రాగానే బాలింత వేషం, దాదినమ్మ వేషం, ప్రహ్లాదలో లీలావతి, ఉషాపరిణయంలో చిత్రరేఖ, ఉషా కన్యల పాత్రల్ని ధరించి ప్రఖ్యాతి వహించారు. సువర్ణ ఘంటాకంకణాలతో సన్మానాలు పొందారు. తరువాత నాటకాలలో పాత్రలు