పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూత్రధారుడు తలను ఆడిస్తాడు. త్రాళ్ళబొమ్మలు, చేతి బొమ్మలకంటే ఊచ బొమ్మల చలనం నెమ్మదిగా వుంటుండి. అయితే వీటి కదకలలో ఎక్కువ అందం వుంటుందంటారు గోపాలస్వామిగారు.

ఒక్క విషయంలో తప్ప, ఊచబొమ్మల రంగస్థలం, నిర్మాణం కూడ చేతి బొమ్మల రంగస్థలం వలేనే వుంటుంది. బొమ్మలకు అమర్చిన కర్రల్ని గుచ్చి నిలబెట్టటానికి వీలుగా చిల్లులు పొడిచిన చెక్కలను రంగ స్థలానికి క్రిందగా అవవసర మైన చోట్ల వుంచుతారు. కొన్ని బొమ్మలకు, ఖాళీ సమయంలో సూత్ర ధారుడు నిలబెట్టటానికి వీలుగా కర్రలకు, అడుగున ఒక అంగుళం దూరంగా ఉండేటట్లు రెండు బిళ్ళలను అమరుస్తారు. చేతి బొమ్మల మాదిరే దీపాలను ఏర్పాటు చేస్తారు.