పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

47

త గి న శా స్తి

 పాత్రు--నా కిటుకు నీకు తెలిసింది. సమూలముగా అవగాహన చేసుకొన్నావు. నేను చెప్పవలసిందే లేదు.

(లోపల--అయ్యగారు)

  ఇదెవరు? ఆడదాని కంఠములా గుంది(పైకి) My dear  నీవు వెళ్ళి వంటపని చూడు. ఎవరో client వచ్చినట్లుంది.(రెబెకా పోవును)
 పాత్రు--Boy! cook! Butler! ఎవరొచ్చారో చూడు పలకడూ! వాళ్ళదా తప్పు? నౌఖరు ఒక్కడే వాడేఅన్ని పనులూచేస్తాడు. ఇంటిలోలేడు కాబోలు, ఎవరది? లోనికి రావచ్చు.

(సరోజిని వచ్చును)

(తనలో) ఇదెవర్తె ! మనిషి బాగానే ఉంది.

 సరో--మీరేనా పాత్రుడుగారు?
 పాత్రు--ఔను, నేనే కాని case ఏమిటో చెప్పకుంటే నా opinion ఇవ్వను. Forgery? perjury? chicanery? Breach of trust? Criminal misappropriation? Culpable homicide? Murder?
 సరో--నన్ను చెప్పనియ్య రేమి ప్రారబ్దము? case ఉన్నమాట నిజమే, రేపుసాయంత్రముమీరు మాయజమానురలింటికి వస్తే కేసు 

ఆమెనోట స్వయముగానే వినవచ్చును.

 పాత్రు--నీయజమానురా లెవరు?