పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

స్వీయ చరిత్రము.

వివాహవ్యయములను భరించి వధువున కిన్నూఱురూపాయలు నగలు పెట్టెదమనియు, దంపతులు కాపుర ముండుటకయి మున్నూఱురూపాయల వెలచేసెడి యింటినిగాని యారొక్కమునుగాని యిచ్చెదమనియు నేను వ్రాసితిని. ఈప్రకారముగా కొన్ని యుత్తరప్రత్యుత్తరములు జరగినమీఁదట తాను వితంతువివాహమును చేసికొనుటకు సంసిద్ధుఁడనయి యున్నాఁడననియు తన బంధువురాలయి ధనికురాలయి యున్న యొకతరుణవితంతువును వివాహమాడుటకు తామేర్పాటు చేసికొంటిమనియు, తనకు ధనసాయాయ్య మక్క