పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

191



నీవివాహమున కారోపింతురు ; అందుచేత ముందెవ్వరును వితంతువులను వివాహముచేసికొన సాహసించుటకే సంశయింతురు. తన్మూలమున నేను పూనిన సంస్కారమునకే విఘాతము కలుగవచ్చును. నాకు తంత్రీవార్తయందఁగానే యాతని విషయమయి యధికశ్రద్ధ చేయవలసినదని మిత్రులక నేకులకు లేఖలను వ్రాసి తంతివార్తలనుబంపి, పథ్యపానము లమర్చుటకయి మాపురోహితుఁడైన శ్రీపాద రామసోమయాజులను ముందుగా కాకినాడమీఁదుగా పొగయోడమీఁదఁబంపి, తరువాత నుపాధ్యాయపదమునందుండి మాలోఁజేరి మాయింటనే యున్న నల్లగొండ కోదండరామయ్యగారిని పయివారపు స్టీమరుమీఁద విశాఖపట్టణమునకుఁ బంపితిని. నేను ప్రతిదినమును తంత్రీవార్తలను బంపి యెప్పటి స్థితి యప్పుడు తెలిసికొనుచుంటిని. కోదండరామయ్యగారు జనేవరు నెల 29 వ తేదిని విశాఘపట్టణముచేరునప్పటికే యతని వ్యాధి యీశ్వరానుగ్రహమువలన మరలి యతఁడు స్వస్థతకు వచ్చుచుండెను. విశాఖపట్టణముచేరిన 1882 వ సంవత్సరము జనేవరు 29 వ తేదిని కోదండరామయ్యగారు నాకిట్లు వ్రాసిరి.

"సుమారు పదిగంటలకు నేటియుదయమున నేనిక్కడ సురక్షితముగా ప్రవేశించితిని. మొన్నటిదినము తంత్రీవార్తవలన తెలిసికొనిన దానికంటె శ్రీరాములు గారిప్పుడు మిక్కిలి వాసిగానున్నట్లు నేను కనుగొంటిని. ఆతని యారోగ్యవిషయమై మీకీవఱకే తంతిసమాచారము పంపఁబడినందున నారాకనుగూర్చి తంతియియ్యలేదు. రక్తగ్రహిణి యించుమించుగా నివారణమైనది...................... నిన్నటి మీతంతివార్త శ్రీరాములకు మిక్కిలి ధైర్యము కలిగించినది. అప్పటినుండి చాలమార్పుగలిగినదని నేను వినుచున్నాను." [1]

  1. "I arrived here safe at about 10 o'clock this morning. I found Sriramulu garu to be much better than he was by the telegram the day before yesterday. I did not telegraph to you about my arrival as you were already telegraphed about his health. Dyssentery is almost cured................ Your yesterday's telegram gave Sriramulu much courage. There has been ever since, I hear much change..............."