పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

స్వీయ చరిత్రము.

నే నారంభదశలో జ్యోతిశ్శాస్త్రమునం దత్యంతవిశ్వాసము కలవాఁడనే యైనను, జన్మపత్రికలలో దీర్ఘాయుష్మంతులగుదురని చెప్పఁబడినవారనేకు

లల్పాయుష్కులగు చుండుటయు, మహాధనాఢ్యు లగుదురని చెప్పఁబడిన వారనేకులు దరిద్రులగుచుండుటయు, సంతానవంతు లగుదురన్న వారనేకులు సంతానహీను లగుచుండుటయు, చిరకాలసువాసిను లగుదురన్న కాంతలు పలువురు బాలవితంతువు లగుచుండుటయు, సుమూహూర్తములు పెట్టుకొని జేసిన కార్యములు పెక్కులు భగ్నము లగుచుండుటయు, చూచుచు వచ్చిన కొలఁదిని నా కీజ్యోతిషవిషయమయి యంతకంతకు నమ్మకము తగ్గి లోకానుభవ మధికమయినతరువాత పూర్ణముగా నశించెను. నా నమ్మకము చెడుటకుఁ గల కారణములను వివరించుట కిది సమయము కాదు. స్థూలముగా నొక్క యంశమును విచారింపుఁడు. మనదేశములో వివాహములకు మంచి ముహూర్తములు పెట్టుకొనని వారెవ్వరుందురు? వధూవరులజాతకములను బరీక్షించి చూచుకొనక లగ్న నిశ్చయము చేయువారెవ్వరుందురు? సుముహూర్తములను బెట్టుకొని జన్మపత్రములనుబట్టి దీర్ఘాయుష్మంతులయినవరుల నేర్పఱుచు