పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

స్వీయ చరిత్రము.

హ్నము సభకూడినపిమ్మట స్త్రీపునర్వివాహవిధాయకవాదులు తమపక్షమును స్థాపించుకొనుటకయి యుపన్యసింపఁ బోవుచుండఁగా బ్రహ్మశ్రీమల్లాది అచ్చన్న శాస్త్రిగా రను మహాపురుషు లక్కడకు విజయంచేసి, తమన్యాయైక దృష్టి వెల్లడియగునట్లుగా సభాధ్యక్షులతో కొంత ధర్మోపన్యాసము చేసి, మధ్యవర్తి లేక వాదప్రతివాదములయొక్క బలాబలములు తేలి సిద్ధాంత మేర్పడదనియు నుభయపక్షములతోను జేరక భగవన్ముఖమునుజూచి నిష్పక్ష పాతముగా న్యాయమును దెలుపుటకు సమర్థులయిన తాము మాధ్యస్థ్యము చేయుట కంగీకరించెదమనియు సభలో నున్న వారి కందఱికిని భ్రమపుట్టునట్లు కొన్ని తేనెమాటలను జెప్పిరి. నిషేధవాదులవాదము నీవఱకే వినియున్నారు గనుక విధాయకవాదులు చెప్పఁబోయెడియుత్తరముకూడ విని మీకు తోఁచిన యభిప్రాయము నియ్యవచ్చునని సభాసదులు పలుకఁగా, పూర్వోక్త మహాపండితులవారు ప్రతిపక్షులు లేకుండ తగవు చెప్పుటయుచితము కాదనియు వారినిగూడ పిలిపింపవలయుననియు పట్టుదలతో సెలవిచ్చిరి. వారు సభకురామని నాటిప్రాతఃకాలమున స్పష్టముగాఁ జెప్పిపోయిరని సభాధ్యక్షులు శాస్త్రులవారితో మనవిచేయఁగా, వారిని పిలిపించుభారమును దాము వహించెదమనిచెప్పి శాస్త్రులవారు తమశిష్యుని నొక్కనిఁ బంచిరి. ఆశిష్యుఁడు వారందఱును బైలుదేఱివచ్చుచున్నారని పదినిమిషములలోనే తిరిగివచ్చి వర్తమానముచేసినను, ప్రతిపక్షులు మాత్రము గంటకులోపల రాలేదు. ఈ లోపుగా విధాయక వాదుల యుపన్యాసమును వినవలెనని పలువురు తొందర పడుచు వచ్చిరి. ప్రతినిషేధవాదులకు వర్తమాన మంపి వారు వచ్చెదమని ప్రత్యుత్తరము పంపిన మీఁదట వారి రాకకయి నిరీక్షింపక తొందరపడి యుపన్యసింపఁ బూనుట యుచితము కాదని యచ్చన్న శాస్త్రులవారు బహుదూరము నొక్కి చెప్పి వారువచ్చువఱకును నాయుపన్యాసము నాపిరి. వారు వచ్చినమీఁదట నేను శ్రుతిభాగముయొక్క యర్థవివరణము చేయఁగానే శాస్త్రులవారు నిష్పాక్షికమైన తమ యభిప్రాయము నిచ్చుటకయి వచ్చు