పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

91

యులుగా నూండినను, అప్పుడు తక్కిన మువ్వురును విద్యార్థులుగాను నే నొక్కఁడనే యుపాధ్యాయుఁడను గాను ఉంటిమి. పత్రికలో మేము వ్రాసిన దానివలన మనసు నొచ్చినవా రందఱును మమ్ము దుష్టచతుష్టయమని పిలుచుచువచ్చిరి. ఆకాలమునందు మావివేకవర్ధని చేసినపనుల నన్నిటిని వివరింపఁ బూనినచోఁ బుస్తకములు నిండవలసియుండును. కాఁబట్టి వానినన్నిటిని విడిచి పెట్టి వానిలోని రెండుమూఁడు ముఖ్యాంశములను మాత్ర మిం దుదాహరించెదను.

వసూళ్లు వేయుట యనఁగా వివాహాదిశుభకార్యములయం దాహూతులయి చూడవచ్చిన పెద్దమనుష్యులందఱును బోగముమేళమునకు రూపాయకు తక్కువకాకుండ నొసఁగు లొసఁగెడియాచార మాకాలమునందు మాప్రాంతములలో సర్వసాధారణమైయుండెను. ఎవ్వరైనను తాంబూలములకు వచ్చిన వారు వేశ్యల కొసఁగులు వేయకుండుట యెంతో యవమానకరముగా నుండు చుండెను. కాఁబట్టి పెద్దకుటుంబమును భరింపవలసినవాఁడయి రిక్తుఁడుగా నున్నవాఁడు సహిత మెంత తక్కువ జీతములోనున్నను చెంబో ముంతో తాకట్టు పెట్టి యప్పుచేసి తెచ్చియైనను రూపాయకు తక్కువకాకుండ బోగముమేళమునకు తప్పక ముడుపు చెల్లించి రావలెను. కొందఱొకానొకప్పుడు వేశ్యలకొసఁగులు సమర్పింపశక్తులుగాక యేవో సాకులు పెట్టి మిత్రబంధుబృందముల మందిరములకు శుభకార్యములకుఁ బోవక తప్పించుకోఁగలిగినను, అట్టి వారు సహితము తప్పించుకో శక్తులుగాక యధికారపిశాచావేశమత్తు లయిన వారియిండ్లకు తప్పకపోయి వేశ్యలకు కట్నములను సమర్పించి రావలసినవారుగానుండిరి. పిలిచినప్పు డధికారులయిండ్లకుఁ బీనిపక్షమున సన్న గాండ్ర కాబలవంతులముందఱ గ్రామములో కాపురముచేయుటయే దుర్ఘటముగా నుండెను. అది యెట్లందురేమో వినుఁడు. ఆకాలమునందు మాపట్టణమునందే యొకదండవిధాయి యుండెను. అతఁడే వేవోమిషలు కల్పించి నెలకు రెండుసారులైనను తనయింట బొగముమేళములు పెట్టి గానవినోదము ననుభవించుటకై యూర