పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) స్థానిక చరిత్రలు : 2070
2) శాసన పాఠాలు : 8076
3) దేశ పటాలు : 79
4) బొమ్మలు : 2630 (డ్రాయింగ్స్)
5) నాణెములు : 6218
6) శిల్ప చిత్రాలు : 106
7) పురాతన వస్తువులు : 40

మెకంజీని గురించి చెప్పేటప్పుడు బొర్రయ్యను మరవలేము. కంపెని కొలువు కోసం బొర్రయ్య మచిలీపట్నంలో హిందూస్తాని, పర్షియన్, ఆంగ్ల భాషలను బాగా నేర్చుకున్నాడు. జైనుల వృత్తాంతం, మొఘలుల తర్వాత కర్ణాటక మందలి సంఘటనలు అను రచనలను ఆంగ్లంలో చేశాడు. మెకంజీ బొర్రయ్య నెంతగానో ఆదరించాడు. తన ఆస్తిలో కొంత భాగం బొర్రయ్యకు చెందునట్లు వీలునామా వ్రాశాడు. బొర్రయ్య తమ్ముడు కావలి వెంకట రామస్వామి మొట్టమొదటిసారి దక్కన్ కవుల జీవిత చరిత్రలు వ్రాశాడు. తెలుగు కవుల జీవిత చరిత్రలను గ్రంథస్థం చేసిన వారిలో మొదటి వాడాయన.

మెకంజీ సొంత పైకం 15 వేల రూపాయలు ఖర్చుచేసి తాళపత్రాలు, శాసనాలు, నాణెములు మున్నగువాటిని సేకరించాడు. మెకంజీ సేకరణలను అతని మరణానంతరం కంపెని పరంగా వారన్ హేస్టింగ్స్ 10 వేల డాలర్లకు కొన్నాడు.

మెకంజీ కృషి వల్లనే అమరావతిలో బౌద్ధ స్థూపమున్న విషయం వెల్లడైంది. 1792లో అమరావతిని దర్శించిన మెకంజీ వెంకటాద్రి నాయుడు గారిని కలుసుకొని, అమరావతి స్థూపము యొక్క వర్ణనము ఏషియాటిక్ సొసైటీ వారి సంపుటాలలో ప్రచురించాడు. హైందవ విజ్ఞాన మందిరానికి కావలి బొర్రయ్య అను మహాద్వారము నాకు లభించెనని మెకంజీ వ్రాశాడు.

వారన్ హేస్టింగ్స్ సంస్కృతం, అరబ్బి, పారసీ, జాపనీస్, బర్మీస్ భాషలలోని తాళ గ్రంథాలను, శిల్పాలు, నాణెములు మున్నగు వాటిని ఇంగ్లాండుకు పంపాడు. దక్షిణ భారత దేశ భాషలలోని స్థానిక చరిత్రలు, తాళ పత్రాలు మున్నగునవి 5,31255 ఇవన్నీ మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో భద్ర పరచబడినాయి. దాదాపు 40 ఏళ్ళు మన చరిత్రకు కావలసిన వస్తు సామగ్రిని సేకరించినవారు మరొకరు లేరు. మెకంజీ 1821లో కలకత్తాలో చనిపోయాడు. నలభై ఏళ్ళ తర్వాత మెకంజీ సేకరించిన కైఫీయత్తులలో చాలవాటికి శుద్ధ ప్రతులు వ్రాయించి ఆ గ్రంథాలను మన కిచ్చిన మరో మహనీయుడు సి.పి.బ్రౌన్.