పుట:Srivemanayogijiv00unknsher.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నావు? ఇందువలన లాభమేమి మానుకొ"మ్మని మందలించెను. గొల్లడును "నేను కోరిక లేకయే మీకు బాలిచ్చుచున్నా"నని మారువల్కి తనపూన్కిని విడనాడకు పాలను సమర్పించుచునే యుండెనట. ఇట్లు కొన్నిదినములు గడచెను. ఒకదినమందు యధాప్రకారముగా పాలను కొని తెచ్చిన గొల్లని బిలిచి "యోరీ నిన్ను జూడ నాకు జాలిగలుగుచున్నది. నీకు మేలుచేయవలయునని తలచితిని నేను చెప్పునట్లు చేయుదువా? "యని యడిగెను. గొల్లండునువల్లెయనెను. గోసాయి తన కెదురుగా నొకమానిసిలోతున గోతి నొకదానిని త్రవ్వ వాని కాజ్ఞాపించె. గొల్లం డట్టులే చేసెను. ఆపిమ్మట ఎండిన కట్టెలను చిదుగులను నందుబేర్చి నిప్పంటించి భగభగమనిమండుచున్న సమయమున నా గొల్లని ఏవేవి మాటల నిష్టగోష్టిగా చెప్పుచు వాని నాగోత బడద్రోయ బ్రయత్నించె నట. అందుపై నిరువురకును నెట్టుకొనుటలు జఱిగినయవి చివరకు గోసాయినే గొల్ల డామంటలో బడనెట్టి పాఱిపోయెను. గోసాయి నీఱయ్యెను. మఱురోజు గడచిన తఱువాత గోసాయి యేమయ్యెనో? చూతముగాక యనుకొని గొల్ల డచ్చటికి పోయి నాగోతియందు చూచును గదా! ఎంతవింత? గోసాయి గోడగడ్డలై ఎక్కడపోయెనో కాని యాస్థానమున మనుష్యుని యంతంత