పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పశ్చాత్తాపపడుటయు, భగవంతుని శరణుజొచ్చుటయు, అంతరాత్మ వేగమునే తప్ప, వేరుమంత్రముగాని, మాట గాని, జపము గాని, స్మార్తక్రియగాని పనిలేదు. పురోహితుడో, గురువో చెప్పు మంత్రము చేతనే ప్రాయశ్చిత్తము కాచాలదు. మంత్రమును, క్రియయు, పురోహితుడును, గురువును ఉపయోగపడక పోరు. పునీతులగుటకు ఋషులును పూర్వులును నుపయోగించినపదములును, కార్యములును, సంకేతములును మనమును నుపయోగించినయెడల మంచి తలవులును, ధైర్యమును, భక్తియు కుదురును. ఇతరులకు తెలియునట్లు చేయు క్రియవలన చేసిన పాపమును గూర్చి సిగ్గునుగల్గును, ఇవన్నియు మనస్సును పునీతముచేయకలుగు సాధనలు. ఇంతేతప్ప దానిని గొని సత్యము నేమరకూడదు. ఒకవేళ నితరుల నేమరింప వచ్చును. తన్ను మోసము చేసికొనవచ్చును. కాని సత్యము నేవిధముననైనను నేమరకూడదు. కర్మవిధి యనునది సత్యపురూపమే. కావున దానినేమరగూడదు. ఒక వర్తకుడు తప్పు త్రాసుతోనో, తప్పుకొలతతోనో జనులను మోసపుచ్చవచ్చునుకాని, యే వ్యాపారియుతనలెఖ్కలోనే మోసముచేసికొనడు. వైద్యుడు రోగియెడల అసత్యము పలుకవచ్చును. కాని యుష్ణమాపక ధర్మామీటరు అను యంత్రము తప్పు చూపించదుగదా!