పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నియమమునకు లోబడిన యాహారమును విహారమును కర్మములచేయుటయందు నియమమునకు లోబడిన క్రమమున్ను నియతమైన నిద్రయును మెలకువయు గలవాడే దుఃఖ నాశకమగు యోగమార్గమును బొందును. 6-17


యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః.


చిత్తమునుకట్టి యాత్మయోగమున నిలిచినయోగికి గాలి లేనిచోట చలింపక నిలచు దీపము సమానమని వచించిరి. 6-19


ఏవిషయమందును మితిమీరిపోకూడదనిగీత దృఢము చేయుచున్నది. యోగసిద్ధికి ముఖ్యమైనసాధనము మనస్సును కాపాడుట. మనస్సు ఎప్పుడును పరుగెత్త చూచుచుండును. మనస్సున నుద్భవమగు తలపుల నడంచనియెడలనవి మనస్సు నావరించుకొని పరుగెత్తించును. ఎప్పుడును గట్టిగాపట్టుకొనియే యుండవలెను.


ఎంతప్రయత్నము చేసినను మరలమరల యోచనలు కలుగును. దానిని చూచి భయపడక అప్పుడప్పుడే మనస్సును స్థిరపరుచుకొని, పరమాత్మ చింతయందు నిలుపవలెను.


సంకల్ప ప్రభవాన్ కామాం స్త్యక్త్వా సర్వా నశేష్ఠతః
మనసై వేంద్రియగ్రామం వినియమ్య సమన్తతః