పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని, మనస్సు నావరించి, బుద్ధిని చెరిచి యాత్మను గోతిలో త్రోయును. కావున, కోటవాకిలిని బలముగ మూసి యుంచ వలెను. చెడ్డయాలోచనలను, యలక్ష్యము చేయక బయటనే యుంచవలెను.


అర్జున ఉవాచ.


అథకేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః
అనిచ్ఛ న్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః


అర్జును డడుగుచున్నాడు: పాపముచేయు నిచ్చలేకు న్నను మనుష్యుని ప్రేరేపించి పాపమునందు చొరచేయున దేది? 3-36


శ్రీభగవానువాచ.


కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా, విధ్యేన మిహ వైరిణం.


శ్రీభగవంతుడు చెప్పుచున్నాడు: "అది రజోగుణము నుండి పుట్టుచున్నది. అదే కామము. అదే క్రోధము. అదే సమూలము తినివేయునది. మిక్కిలిగ పాపమును గురిచేయు నది. జీవితమునకు శత్రు విదియే యని తెలిసికొనుము. 3-37


ధూమే నావ్రియతే వహ్ని ర్యథాదర్శో మలేన చ
యధోల్బే నావృతో గర్భ స్తథా తేనేదమావృతం.