పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(18)

మనోసాధన.

(గీత: అధ్యాయములు. 2, 3, 16, 18.)


ఇట్లు గీతలో చేయబడిన యుపదేశముచే లోకజీవన మునువిడువ మనస్సులేనివారి కొకవిధమగు సమాధానము గనో, యుపశమన రూపముగనో యుండవలెనని చేయబడిన యుక్తిమాటకాదు. నిజముగా నందరు పురుషులును, స్త్రీలును బాలురను తమజీవితము నీమార్గమున నడపి, యేకర్మమునైనను స్వార్థపరత్వములేక, జనసమూహము మేలుకొరకే మనస్సు స్వాధీనముచే అభ్యాసము చేసికొనుటను గూర్చి గీతయం దుపదేశము చేయబడినది. చేయగా చేయగా నేదియు నొకనికి స్వభావమై తీరును. సంగము లేక కర్మము చేయుటయు నిట్లే యభ్యాసమైనయెడల స్వభావ మగును.


చేయు కర్మమును బాగుగ కొనసాగించుటకు నిదియే మార్గమగును. సంగమును కామమును మనస్సున కళవరమును భయమును బుట్టించును. జయాపజయముల చింతచేత బుద్ధియొక్క చురుకుతనము తక్కువయగును. కావున, నిస్సంగియై స్వార్థమును విడిచి, కర్మమును చేయుటే కర్మములను బాగుగ కొనసాగించు మార్గము. నీటిలో నీదుబాతు నీటిని