పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యని యెంచువాడు, పనులను చేయుచున్నను అవి యతని నంటవు. 5-7


కాయేన మనసా బుద్ధ్యా కేవలై రింద్రియై రపి
యోగినః కర్మ కుర్వన్తి సంగం త్యక్త్వా౽త్మశుద్ధయే.


యోగులు స్వార్థమును సంపూర్ణముగవిడిచి యాత్మ శుద్ధికొరకు శరీరముతోను, మనసుతోను, బుద్ధితోను, కేవల మింద్రియములతోనుగూడ పనులను చేయుచుందురు. 5-11

కర్మములను సంగములేక చేయుట, సన్న్యాసమార్గము ననుసరింప ప్రయత్నము చేయుటకంటెను మేలైనమార్గమని గీతలో పలుచోట్ల పలువిధముల నొత్తి చెప్పబడియున్నది. కడపటి యధ్యాయమునకును పేరు 'సన్న్యాసయోగ'మని చెప్పియున్నను నాయధ్యాయము నారంభమందే భగవం తుడు ఇట్లు చెప్పుచున్నాడు.


కామ్యానాం కర్మణాంన్యాసం సన్యాసం కవయో విదుః
సర్వకర్మఫల త్యాగం ప్రాహు స్త్యాగం విచక్షణాః.


ఫలముల నాసించి చేయు పనులను విడుచుటయే సన్న్యాసమని జ్ఞానులు తెలిసికొందురు. కర్మముల ఫలములను మొదలంట విడుచుటయే త్యాగమని వారు చెప్పుదురు. 18-2


నియతస్యతు సన్న్యాసః కర్మణో నో పపద్య తే
మోహాత్తన్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః.