పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున అజ్ఞానముచేగలిగిన సంశయమును. జ్ఞానమను కత్తితోకోసి, యోగము నవలంబించి, కర్మములను చేయ నిశ్చయించి నిలువుము. 4-42

ఈజ్ఞానమును మనము పొందినపిదప, సాంఖ్యమార్గమునకును, యోగమార్గమునకును, అనగా జ్ఞానమార్గమునకును నిష్కామయోగమార్గమునకును గల భేదమంతయు విడిపోవును. జ్ఞానమును కర్మమును చేరినచో కర్మయోగమగును. సన్న్యాసమును, స్వార్థమును విడిచి యాచరించు కర్మయోగమును, ఒక్కటేయగును.


సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః
ఏక మప్యాస్థిత స్సమ్య గుభయోర్విన్దతే ఫలం.


సాంఖ్యమును యోగమును వేర్వేరనిచెప్పువారు తెలి యని పిల్లలవంటివారు. తెలిసినవారట్లనరు. వీనిలో నేదొ యొకదానియందు బాగుగానిలిచిన వాడు రెంటిఫలమును పొంద గలడు. 5-4


అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
స సన్న్యాసీ చ యోగీచ న నిరగ్ని ర్న చాక్రియః


ఫలమునెదురుచూడక, చేయవలసిన దానిని చేయు వాడె త్యాగి; యోగియునతడే. అగ్ని నారాధించుట మానిన వాడునుకాడు. కర్మములచేయనివాడునుకాడు. 6-1