పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(3)

అల్పజ్ఞానపు భ్రమ

భౌతికశాస్త్రవిషయములు కొంచెము తెలియుటతోడ నే కొందరికి భ్రమ కలుగును. దానిలోను మరికొందరు చేసిన శోధనఫలముగా, గుజిలీఅంగడిలో తక్కువవెలకు ప్రాతసామానులవలె, శ్రమలేకయే సంపాదించిన జ్ఞానము కొందరి కధికబోధ నిచ్చునదిగా నుండును. ఏది చిన్నది, ఏ‌ది పెద్దది, ఏది దగ్గరగా నుండును, ఏది దూరము అను నిదానబుద్ధి తగ్గిపోవును. ఏది తమకు తెలియకుండునో యది లేనేలేదని సాధించుకొందురు. మనుష్యుని జ్ఞానమున కందని దంతయు నసత్యమని త్రోసిపుచ్చుటకు జనులు ముందంజ వేయుదురు. శాస్త్రమనియు, ధర్మమనియు, నంతయు, మోసగాండ్రు వ్రాసియుంచినారని చెప్పుదురు; ఇవన్నియు పామరజనులను మోసగించుట కే మూఢులవేత వ్రాయ బడినవనియు సాధింతురు. కాని ప్రకృతిశాస్త్రములను పరిశోధించి ప్రకృత్యవస్థలను చూచి గ్రహించుటకు తమ అయుష్కాల మంతయు తమ శక్తినంతయును ధారపోసిన వారు ఇట్టి యున్మత్తతకు లోను కారు. ప్రకృతిశాస్త్ర పరిశోధకులు పలువురు గొప్ప వినయము గలిగినవారుగా నున్నారు. తాము కనిపెట్టినవి చాల నెక్కువగ నున్నను,