పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యే౽ప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయా న్వితాః
తే౽పిమామేవ కౌంతేయ యజన్త్యవిధిపూర్వకం.


అన్యదేవతలను శ్రద్ధతో భజించు భక్తులును, విధిని తప్పనవారైనను నన్నే యారాధించుచున్నారు. 9-23



పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యాప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రియతాత్మనః.


ఆకు, పువ్వు, పండు, నీరు ఏదియైనను నాకొకడు భక్తితో నర్పించినయెడల తన్ను తా జయించి యిట్టిభక్తితో నాకిచ్చినదాని నాదరముతో నంగీకరింతును. 9-26


యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం.


నీ వేదిచేసినను దేనిని తినినను, నా కర్పణమనియే చేయుము. 9-27


కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే౽ న్యదేవతాః
తంతంనియమమాస్థాయ ప్రకృత్యానియతా స్స్వయా.


చాల కోరికతో కూడియున్న మనస్సును గలవారు తమతమ ప్రకృతిచేత కట్టబడి, వేర్వేరు నియమములను చేపట్టియుండ, కొంద రన్యదేవతల ననుసరించుచున్నారు. కాని, 7-20