31
యు ద్ధ కాం డ ము
యీ రాక్షసులు? విన - మేవారి కథలు!
జలనిధి దాఁటి ని - కావేళలంకఁ
గలయఁ గన్గొని సీతఁ - గని మాటలాడి
యీపురంబుదహించి - యేఁగినాఁ డొకరుఁ
డాపవనతనూజుఁ - డన్నట్టిచోట !
అట్టి వానరకోటు - లాసయై వచ్చి
నట్టి రాఘవు గెల్వ - నగునె యెవ్వరికి ?” 690
అని కొల్వులో వారి - నందఱిఁఁ జూచి
"వినుఁడేలు యీ యవి - వేకంబు మీకు?
ఖరదూషణాదుల - క్రమ మెఱింగియును
దురమేల రాముని - తోడ నొక్కనికి ?
అది వినియుండి ప్రా - ణాశలు లేక
మదిఁగ్రొవ్వి మేనులు - మఱచి పల్కెదరు!
రాఘవుఁ డేమి నే - రము సేయఁ దెచ్చె
లాఘవవృత్తి ని - లాపుత్రి నితఁడు ?
పరకామినులఁ గోరు - పాపకర్మలకు
దొరకునే కీర్తులు - దురములోఁ జయము? 700
ఇట్టివానికి ధర్మ - మేడది? చాల
పట్టగుఁ గాక పా - పంబుల కెల్ల !
సీతను మఱల ని - చ్చిన మనకెల్ల
ఖ్యాతియు జయము సౌ - ఖ్యములును గలుగు.
అటులైన బ్రదుకుదు - మాపదలేక
యెటులున్నదియొ కర్మ - మీయన్నచేత ?
రామలక్ష్మణుల నా - రాచదావాగ్ని
భీమమై లంకలోఁ - బెరిగి వీడెల్ల