24
శ్రీ రా మా య ణ ము
యాయత నిష్ఠతో - యజ్ఞంబు సేసి
వరము లందినవాఁడు - వాని కట్టెదుర
నరులెంతవారు వా - నరు లెంత వారు ?
మన మెల్ల నెఱుఁగమే - మఱచితిరేమొ ?
అనుపమ వివిధశ - స్త్రాస్త్ర మీనంబు 530
గజకచ్ఛపము రథ - గ్రామంబు తురగ
భుజగంబు ఖచర బు - ద్బుదమును యక్ష
మకరంబు సిద్దస - మాజ మండూక
మకలంక పణవ మ - హావిరావంబు
చామర డిండీర - చయము కేతూర్మి
రామణీయకమును - రక్తనీరంబుఁ
గలిగిన దివిజ సం - గ్రామ వారాశి
గలఁచి గాలించి తాఁ - గవ్వపుఁ గొండ
గతినుండి యమృతంబుఁ - గైకొన్నయట్లు
శతముఖుఁ బట్టి దు - ర్జయ శౌర్యుఁడగుచు 540
నీలంక లోపల - నిందఱుఁ జూడ
జాలినొందఁగఁ జెఱ - సాలలోవైన
దిక్కెవ్వరును లేక - దిగులుచే నుండ
నక్కమలజుఁడు మి - మ్మడిగి ప్రార్థించి
విడిపించుకొనిపోయె! - విల్లంది నీదు
కొడుకు నిల్చినమేరు - కోదండుఁడైన
నెదిరింపఁ జాలునేఁ ? - యిది యేటిమాట?
ఎదురేలవచ్చె నీ – కెంత వానికిని !”
అనునంతలో నాద - శానను జూచి
యనుచితోక్తులచేఁ బ్ర - హస్తుఁ డిట్లనియె. 550