ఈ పుట ఆమోదించబడ్డది
116
శ్రీ రా మా య ణ ము
వినతుండు భుజశౌర్య - వినతుండు వాఁడె
కనుఁగొమ్ము లంకనె - క్కటి గెల్వఁదలఁచెఁ
బ్రథనంబుకు నిన్నుఁ - బలిమి చేఱుచును
-: గ్రథనుఁడు :-
గ్రథనుఁడు వేనవేల్ - కపులుభజింప
సెలవిమ్మనుచుఁ దాను - శ్రీరాముతోడఁ
బలికె నేవినఁగ నీ - పయిఁ గలహింప
బలిమితోఁగపులు డె - బ్బది కోట్లుగొలువఁ 2580
--: గవయుఁడు :-
గలహంబుఁ గోరుచు - గవయుఁడన్ వాఁడు
చూడుము తనదు పౌఁ - జులు దీర్చిచూచు
వేఁడుక నున్నాడు - విబుధారినాథ !
-: హరుఁడు :-
శతకోటివానర - స్వామియైనట్టి
యతిసత్త్వ నిధివాఁడు - హరుఁడనువాఁడు
--: ధూమ్రుఁడు :-
తిరమైన నర్మదా - తీరంబునందుఁ
బరఁగి యానము ఋక్ష - పర్వతంబేలు
నిల వేడుకోటుల - యెలుఁగులు గొలువ
నలరెఁ జూడుము ధూమ్రు - డాఋక్షవిభుఁడు.