33
యు ద్ధ కాం డ ము
కోదండ నిర్ముక్త - ఘోరదివ్యాస్త్ర
పటలంబు శారద - పద్మాప్త కిరణ
చటులంబులై క్రొత్త - సానలఁ దేఱి
యపరంజి గరలతో - నశని జాలంబు
విపులాధరంబు పై - వెసఁ బడినట్లు
నీమేన నాఁటి శో - ణితధార లొలుక
భూమిఁద్రెళ్లింప న - ప్పుడు చూడలేని 740
ఖేదంబుతో నిన్నుఁ - గినిసి యిట్లాడు
నాదు వాక్యములు మ - న్నన వింటివేని
నిన్ను నమ్మినవారు - నీపుత్రపౌత్రు
లన్నదమ్ములు గొల్చి - నట్టివారలును
జావక నోవక - సకల సౌఖ్యముల
నీవెంటఁ గొఱలేక - యీలంకతోడ
మనవచ్చు నీసీత - మనకేల ? రాఘ
వున కిమ్ము కుల మీలు - వునుఁ గాచికొమ్ము!
చలము మాను" మటన్నఁ - జయ్యన లేచి
కొలువుదీఱి మనంబు - కొందలంబంద 750
నగరిలోపలికేఁగి - న విభీషణాదు
లగువారు జనిరి ని - జావాసములకు
-: రావణుఁడు కొలువువిడిచి వెడలుట - విభీషణుఁడు రావణునగిరికి బయలు దేయుట :--
ఆమఱునాఁడు ప్రా - హ్ణంబున లేచి
రామహిత ప్రచా - రత విభీషణుఁడు
కొలువు సింగారమై - కొలకొల యనుచు