పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81


ఉ. భూసురపాద దేణువులు పుణ్యులఁ నరేంద్రులన్ భరి

త్రీసురులార ! మీ చరణరేణు కణంబులు మేనుసోక నా

చేసిన పాప పంతయు నశించెఁ గృతార్థుఁడనైతి నెద్ది నేఁ

జేసిన ముక్తి పద్ధతికిఁ జెచ్చెర బోవఁగవచ్చుఁ జెప్పరే . (499)


క. భీకరతర సంసార, వ్యాకులతన్ విసిగి దేహవర్ణనగతి నా

లోకించు నాకుఁ దక్షక, కాకోదర విషము ముక్తికారణ మయ్యెన్ . (500)


క. ఏపార నహంకార, వ్యాపారమునందు మునిఁగి వర్తింపంగా

నాపాలిటి హరి భూసుర, శాప వ్యాజమున ముక్తిసంగునిఁ జేసెన్ . (501)


మ. ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ

శ్వర సంకల్పము నేఁడు మానదు భవిష్య జ్జన్మ జన్మంబులన్

హరి చింతా రతియున్ హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్

హరి పాదాంబుజ సేవయున్ గలుగ మీ రర్థిన్ బ్రసాదింపరే . (502)


క. చూడఁడు నా కల్యాణము, పాడుఁడు గూవిందు మీఁది పాటలు దయతో

నాడుఁడు హరి భక్తిల కథ, లే డహములలోన ముక్తి కేఁగఁగ నిచటన్. (503)


క. అమ్మా ! నినుఁ జూచిన నరుఁ , బొమ్మాయని ముక్తికడకుఁ బుత్తువఁట కృపన్

లెమ్మా నీ రూపముతో, రమ్మా నా సెదురు గంగ ! రమ్యతరంగా ! (504)


వ. అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరబులందైన సర్వజంతు సౌజన్యంబు సంధిల్లుంగాక యని, గంగా తరంగిణీ దక్షిణ కూలంబునన్ బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి రాజ్యధారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునకుఁ దప్పించి, చిత్తంబు హరికి నిప్పించి, పరమ భాగవతుండైన పాండవ పౌత్రుండు ప్రాయోపవిష్ణుండైయున్న సమయంబున. (505)


క. ఒత్తిలి పొగడుచు సురలు వి, యత్తలమున నుండి మెచ్చి యలరుల వానల్

మొత్తములై కురిసిరి నృప, సత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్ . (506)


వ. ఆ సమయంబున సభాసీనులైన ఋషు లిట్లనిరి. (507)


మ. క్షితినాథోత్తమ ! నీ చరిత్రము మహాచిత్రంబు మీ తాత లు

గ్ర తపోధన్యులు విష్ణూపార్శ్వ పదవిన్ గావించి రాజన్య శో

భిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రు

న్నతులై నీపు మహోన్నతుండవుగదా ! నారాయణధ్యాయివై. (508)